Buzzing Stock: కొత్త గరిష్ఠాలకు స్టాక్.. రూ.వెయ్యి కోట్ల ఆర్డర్లతో దూకుడు.. కొన్నారా..??
Buzzing Stock: మార్కెట్ల ట్రెండ్ తో సంబంధం లేకుండా కొన్ని కంపెనీల షేర్లు వేగంగా దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో ఇంజనీరింగ్ స్టాక్ తన కొత్త 52 వారాల గరిష్ఠానికి చేరుకుని ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది.
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది KEC ఇంటర్నేషనల్ లిమిడెట్ కంపెనీ షేర్ల గురించే. బుధవారం ఇంట్రాడేలో స్టాక్ ర్యాలీతో అద్భుతమైన పెరుగుదలను నమోదు చేసింది. స్టాక్ 11.23 శాతానికి పైగా లాభపడటంతో సరికొత్త 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం 1.18 గంటల సమయంలో స్టాక్ ధర రూ.678.50 వద్ద కొనసాగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఎన్ఎస్ఈలో స్టాక్ 747.70 ధరను చేరుకుంది.

అసలు ఈ భారీ ర్యాలీకి అసలు కారణం కంపెనీ రూ.1,012 కోట్ల విలువైన ఆర్డర్‌లను పొందటమేనని వెల్లడైంది. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం సివిల్ కేటగిలీలో లో పశ్చిమ భారతంలో డేటా సెంటర్, దక్షిణ భారతంలో ప్రపంచ FMCG దిగ్గజం కోసం తయారీ కంపెనీ ఏర్పాటు ప్రాజెక్టులు చేపడుతున్నట్లు వెల్లడైంది. అలాగే ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్(T&D) విభాగం ఇండియాతో 765 kV ట్రాన్స్‌మిషన్ లైన్ ఆర్డర్‌తో పాటు అమెరికాలో టవర్లు, హార్డ్ వేర్ అండ్ పోల్స్, కేబుల్స్ సరఫరా ఆర్డర్లను పొందింది.
సివిల్ వ్యాపారం కీలకమైన కస్టమర్లను పొందటంతో తన కస్టమర్ బేస్‌ను వైవిధ్యపరచడం కొనసాగిస్తోందని KEC ఇంటర్నేషనల్ MD, CEO విమల్ కేజ్రీవాల్ తెలిపారు. డేటా సెంటర్ల నిర్మాణ ఆర్డర్ ఈ విభాగం బలమైన వృద్ధిపై తమ విశ్వాసాన్ని పెంచుతుందన్నారు. 2023 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కంపెనీ ఆర్డర్ బుక్ పరిశీలిస్తే.. గత ఏడాది కంటే 11 శాతం బలమైన వృద్ధితో రూ.6,500 కోట్లకు పైగా ఆల్ టైమ్ హైకి చేరుకున్నట్లు విమల్ కేజ్రీవాల్ తెలిపారు.


Click it and Unblock the Notifications