kaycee Industries: గడచిన ఏడాది కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్ల ఊహించని బుల్ రన్ అనేక కంపెనీలు మల్టీబ్యాగర్లుగా మారాయి. ఇవి ఇన్వెస్టర్ల సంపదను తక్కువగా కాలంలోనే అనేక రెట్లు పెంచాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది కైసీ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్ల గురించే. ఈ కంపెనీ షేర్లు శుక్రవారం మార్కెట్ల ముగింపు సమయానికి షేర్లు ఎక్స్-బోనస్, ఎక్స్-స్ప్లిట్‌తో ట్రేడ్ అయ్యాయి. ఈ పెన్నీ స్టాక్ షేర్లు శుక్రవారం అప్పర్ సర్క్యూట్ తాకాయి. ఇక్కడ విశేషం ఏమిటంటే కంపెనీ తొలిసారిగా తన పెట్టుబడిదారులకు ఉచితంగా బోనస్ షేర్లను అందించబోతోంది.

రూ.100 ఫేస్ వ్యాల్యూ కలిగిన ఒక షేరును 10 ముక్కలుగా విభజించనున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది. ఈ స్టాక్ స్ప్లిట్ తర్వాత కంపెనీ షేర్ల ఫేస్ వ్యాల్యూ ఒక్కో షేరుకు రూ.10కి తగ్గనుంది. ఇదే క్రమంలో కంపెనీ ప్రతి షేరుకు 4 బోనస్ షేర్లను కూడా ఇస్తోంది. బోనస్ షేర్లు, షేర్ల కేటాయింపు రికార్డు తేదీని జూలై 5గా కంపెనీ నిర్ణయించింది. అంటే రికార్డు తేదీ నాటికి కంపెనీ రికార్డు బుక్స్ ప్రకారం పేర్లు కలిగి ఉండే ఇన్వెస్టర్లు కంపెనీ అందించే బోనస్ షేర్ల ప్రయోజనాన్ని అందుకోనున్నారు.
డబుల్ ధమాకాలో భాగంగా కంపెనీ ఇన్వెస్టర్లకు ఉచిత బోనస్ షేర్లతో పాటుగా ఒక్కో షేరుపై డివిడెండ్ కూడా ప్రకటించింది. మార్చి 31తో ముగిసే ప్రతి ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుపై రూ.60 తుది డివిడెండ్ చెల్లిస్తామని మే 28న స్టాక్ ఎక్స్ఛేంజీలకు కంపెనీ తెలిపింది. ఒక్కో షేరుపై కంపెనీ రూ.40 ప్రత్యేక డివిడెండ్ కూడా ఇస్తోంది. అంటే క్వాలిఫైడ్ ఇన్వెస్టర్లు ఒక్కో షేరుపై రూ.100 లాభం పొందుతారు. కైసీ ఇండస్ట్రీస్ ఈ డివిడెండ్ రికార్డు తేదీని ఆగస్టు 9గా సెచ్ చేసింది. శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి బీఎస్ఈలో ఒక్కో షేరు ధర రూ.1365.50గా ఉంది. గడచిన ఏడాది కాలంలో కంపెనీ షేర్లు తమ ఇన్వెస్టర్లకు 470 శాతం లాభాన్ని అందించాయి.


Click it and Unblock the Notifications