IPO News: ఇష్యూ తొలిరోజే ఐపీవో మిరాకిల్స్.. భారీ లాభాల కోసం బెట్టింగ్స్ షురూ.. మీరూ కొంటున్నారా
Kay Cee Energy IPO: నేడు మార్కెట్లోకి ఇష్యూ ప్రారంభమైన ఐపీవో సూపర్ లాభాలతో ఇన్వెస్టర్లకు స్వాగతం పలికింది. గ్రేమార్కెట్లో దూకుడు కనబరిచింది.
ఈరోజు మార్కెట్లోకి వచ్చిన కేసీ ఎనర్జీ అండ్ ఇన్‌ఫ్రా షేర్లపై బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్ల పంట పండింది. కంపెనీ మార్కెట్లో తన బలమైన ఐపీవోను తీసుకురావటంతో ఇన్వెస్టర్లలో కోలాహలం కొనసాగుతోంది. సబ్‌స్క్రిప్షన్ కోసం డిసెంబర్ 28 నుంచి జనవరి 2 వరకు ఐపీవో తెరచి ఉండనుంది. ఈ క్రమంలో కంపెనీ ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.51-54గా నిర్ణయించింది. అయితే కంపెనీ షేర్లు ప్రస్తుతం గ్రేమార్కెట్లో 75 శాతం ప్రీమియంతో దూసుకుపోతున్నాయి. దీంతో లిస్టింగ్ సమయంలో భారీగా లాభాలను ఆర్జించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

కేసీ ఎనర్జీ ఐపీవో ఇష్యూ గరిష్ఠ ప్రైస్ బ్యాండ్ రూ.54 ఉండగా.. షేర్లు గ్రే మార్కెట్ ప్రీమియం రూ.40కి చేరుకోవటం సంచలనంగా మారింది. ఇదే దూకుడు కొనసాగితే లిస్టింగ్ రోజున స్టాక్ ధర రూ.94గా ఉండవచ్చు. ఇది వాస్తవ ఇష్యూ ధర కంటే దాదాపు 75 శాతం అధిక రేటు. KC ఎనర్జీ & ఇన్‌ఫ్రా పబ్లిక్ ఇష్యూ మొత్తం పరిమాణం రూ.15.93 కోట్లుగా ఉంది. కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో జాబితా కానున్నాయి.
కేసీ ఎనర్జీ ఐపీవోలో రిటైల్ ఇన్వెస్టర్ల కోసం లాట్ పరిమాణాన్ని 2000 షేర్లుగా నిర్ణయించింది. దీనికోసం ఒక లాట్ కొనేందుకు కనీసం రూ.1,08,000 పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. షేర్ల కేటాయింపు జనవరి 3, 2024న ఫైనల్ అవుతుంది. అలాగే జనవరి 5, 2024న మార్కెట్‌లో జాబితా చేయబడతాయి. KC ఎనర్జీ & ఇన్‌ఫ్రా 2015 సంవత్సరంలో ప్రారంభించబడింది. కంపెనీ విద్యుత్ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థల కోసం నిర్మాణ, కమీషనింగ్ సేవలను అందిస్తుంది.


Click it and Unblock the Notifications