IPL News: ఐపీఎల్ 2025 కోసం జెడ్డాలో నిర్వహిస్తున్న మెగా వేలంలో హైదరాబాద్ టీమ్ యజమాని కావ్య మారన్ తొలి షాపింగ్ పూర్తి చేశారు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీని రూ.10 కోట్ల ధరకు ఆమె సొంతం చేసుకున్నారు. దీంతో ఆమె తెలుగువాళ్లు ఎదురుచూస్తున్న ఎస్ఆర్‍హెచ్ టీమ్ కోసం కోలకతా నైట్‌రైడర్స్ తో పోటీ పడి ఈ ఆటగాడిని దక్కించుకుంది.
షమీ పాత ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ ఆటగాడిని తిరిగి తీసుకోవటానికి ఆసక్తి చూపకపోవటంతో సన్‍రైజర్స్ మాత్రం సొంతం చేసుకుంది. ప్యాట్ కమిన్స్‌కు తోడుగా సీనియర్ ఇండియన్ పేసర్‌ను కొనుగోలు చేయడం మంచి ఆప్షన్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫిట్‌నెస్ సమస్యలు లేకుండా షమీ అన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటే ఇది మంచి రిజల్ట్స్ అందించవచ్చని నిపుణులు క్రీడా అభిమానులు చెబుతున్నారు. దీనికి ముందు కావ్య మారన్ అర్ష్‌దీప్ సింగ్ ని కొనుగోలు చేసేందుకు సైతం భారీగా కృషి చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఇదే క్రమంలో ఐపీఎల్ 2025 కోసం కొనసాగుతున్న మెగా వేలంలో భారీగా ధర పలికిన ఆటగాళ్లను పరిశీలిస్తే.. రిషభ్ పంత్ రూ.27 కోట్లు, శ్రేయస్ అయ్యర్ రూ.26.75 కోట్లు, అర్ష్‌దీప్ సింగ్ రూ.18 కోట్లు, జోస్ బట్లర్ రూ.15.75 కోట్లు, మిచెల్ స్టార్క్ రూ.11.75 కోట్లు, కగిసో రబడా రూ.10.75 కోట్లు, మహమ్మద్ షమీ రూ.10 కోట్లు, డేవిడ్ మిల్లర్ రూ.7.5 కోట్లకు వివిధ ప్రాంఛైజీలు దక్కించుకున్నాయి.
2024లో ఐపీఎల్ వ్యాపార విలువ 16.4 బిలియన్ డాలర్లుగా ఉండగా ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 6.5% పెరుగుదలను నమోదు చేసింది. ఇది డిస్నీ స్టార్, వయాకామ్18, టాటా సన్స్‌లతో కీలకమైన ఒప్పందాలతో నడిచింది. అలాగే స్టాండలోన్ బ్రాండ్ విలువ 3.4 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు వెల్లడైంది. ఇదే క్రమంలో ఫ్రాంచైజీల వారీగా చెన్నై సూపర్ కింగ్స్ విలువ 231 మిలియన్ డాలర్లుగా ఉండగా, రెండవ స్థానంలో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విలువ 227 మిలియన్ డాలర్లుగాఉంది. ఇదే క్రమంలో మూడో స్థానంలో నిలిచిన కోల్‍కతా నైట్ రైజర్స్ విలువ కూడా భారీగానే పెరిగిందని వెల్లడైంది.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో పాల్గొనేందుకు మొత్తం 1574 మంది రిజిస్టర్ చేసుకోగా.. బీసీసీఐ 574 మందిని షార్ట్ లిస్ట్ చేసింది. రిటెన్షన్ ప్రక్రియ అనంతరం 10 ఫ్రాంచైజీల్లోని 204 స్థానాల కోసం ఈ ఆటగాళ్లు పోటీపడనున్నారు. పాల్గొంటున్న వారిలో 366 మంది భారత ఆటగాళ్లు మిగిలిన 208 మంది ఓవర్‌సీస్ క్రికెటర్లు ఉన్నారు. నేడు స్టార్ట్ అయిన మెగా ఐపీవో 2025 వేలం పాటలో ఈసారి భారత్‌కు చెందిన 318 మంది అనామక ఆటగాళ్లు ఐపీఎల్ 2025 మెగా వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 12 మంది అన్‌క్యాప్‌డ్ ఓవర్‌సీస్ ప్లేయర్లు వేలంలో పాల్గొంటున్నారు. 10 ఫ్రాంచైజీల్లో కలిపి మొత్తం 70 ఓవర్‌సీస్ స్లాట్స్ నేడు అందుబాటులో ఉన్నాయి. ఈ మెగా ఐపీఎల్ వేలం సౌదీ అరేబియాలోని జెడ్డాలో కొనసాగుతోంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications