Kataria Industries IPO: బడ్జెట్ తర్వాత నేడు దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ పతనాన్ని చూస్తున్నప్పటికీ ఐపీవోలు మాత్రం తమపని తాము చేసుకుని పోతున్నాయి. ఈ క్రమంలో నేడు మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీ ఇన్వెస్టర్లకు బంపర్ రాబడులను అందించింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది నేడు మార్కెట్లోకి వచ్చిన కటారియా ఇండస్ట్రీస్ షేర్ల గురించే. స్మాల్ క్యాప్ కంపెనీ కటారియా ఇండస్ట్రీస్ స్టాక్ మార్కెట్లో నేడు బలమైన లిస్టింగ్ నమోదు చేసింది. కంపెనీ షేర్లు తొలిరోజే ఇన్వెస్టర్ల సొమ్మును డబుల్ చేశాయి. నేడు కటారియా ఇండస్ట్రీస్ షేర్లు మార్కెట్లో 90 శాతం ప్రీమియంతో రూ.182.40 వద్ద ఒక్కోటి లిస్ట్ అయ్యాయి. అయితే వాస్తవానికి కంపెనీ ఇష్యూ సమయంలో షేరు గరిష్ఠ ధరను రూ.96గా నిర్ణయించింది. వాస్తవానికి కటారియా ఐపీవో జూలై 16 నుంచి 19 వరకు రిటైల్ ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడింది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ రూ.54.58 కోట్లను సమీకరించింది.

విజవంతంగా లిస్టింగ్ జరిగిన తర్వాత కటారియా ఇండస్ట్రీస్ షేర్లు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. దీంతో స్టాక్ ధర నేడు రూ.191.50కి చేరాయి. ఇష్యూ ధర రూ.96తో పోలిస్తే కటారియా ఇండస్ట్రీస్ షేర్లు దాదాపు 100% పెరిగాయి. ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో లిస్టింగ్ రోజునే కంపెనీ షేర్లు ఇన్వెస్టర్ల సొమ్మును రెట్టింపు చేశాయి. కంపెనీ ఐపీవో ద్వారా వచ్చిన మెుత్తాన్ని యంత్రాల కొనుగోలుకు, రుణాల చెల్లింపులకు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలకు వినియోగించాలని నిర్ణయించింది. ప్రస్తుతం కంపెనీ ప్రమోటర్లుగా సునీల్ కటారియా, అరుణ్ కటారియా, అనుప్ కటారియా ఉన్నారు.
కటారియా ఇండస్ట్రీస్ ఐపీవో మొత్తం 393.87 సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. ఈ క్రమంలో రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 274.61 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కేటగిరీలో IPOలో 970.17 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారుల కోటా 171.04 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. ఈ క్రమంలో ఐపీవోలో కంపెనీ లాట్ పరిమాణాన్ని 1200 షేర్లుగా ఉంచింది. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు పాల్గొనేందుకు కనీసం రూ.1,15,200 ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది.


Click it and Unblock the Notifications