తెలంగాణ హైకోర్టులో కార్వీకి చుక్కెదురు: జీఎస్టీ ఫైలింగ్ యూనిట్ విక్రయం
కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్‌కు (KSBL) మంగళవారం తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తమ గ్రూప్ కంపెనీల వ్యవహారాలపై దర్యాఫ్తును సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్‌కు (SFIO) అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై కార్వీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. కంపెనీల చట్టం ప్రకారం దర్యాఫ్తు జరిపించే అధికారం కేంద్రానికి ఉందని న్యాయస్థానం తెలిపింది. SFIOకు దర్యాఫ్తును అప్పగించాలన్న కేంద్ర నిర్ణయాన్ని సవాల్ చేస్తూ KSBL హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై మంగళవారం విచారణ చేపట్టి, కొట్టి వేసింది.
పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా కేంద్రం దర్యాఫ్తు చేయాలని చూస్తోందని కార్వీ లాయర్ కోర్టుకు విన్నవించారు. కాబట్టి దీనిని నిలిపివేయాలని కోరారు. కంపెనీల చట్టం సెక్షన్ 212 ప్రకారం కేంద్రానికి అధికారం ఉందని కేంద్రం తరఫున సహాయ సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. కార్వీ సహా తొమ్మిది కంపెనీలపై ఫిబ్రవరి 24న కేంద్రానికి నివేదిక పంపారని, ఈ కంపెనీలపై దర్యాఫ్తు జరపాల్సిన అవసరముందన్నారు.

కార్వీ జీఎస్టీ ఫైలింగ్ యూనిట్‌ను కొనుగోలు చేయనున్న క్లియర్ ట్యాక్స్
ఆన్‌లైన్ ట్యాక్స్ ఫైలింగ్ ప్లాట్‌ఫాం క్లియర్ ట్యాక్స్ (ClearTax) కార్వీకి చెందిన కార్వీకి చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ జీఎస్టీ ఫైలింగ్ యూనిట్‌ను కొనుగోలు చేస్తోంది. కార్వీ తన అసెట్స్‌ను విక్రయించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో క్లియర్ ట్యాక్స్ దీనిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపింది. బ్యాంకులు, పెట్టుబడిదారుల బకాయిలు చెల్లించేందుకు అసెట్స్ అమ్మాలని కార్వీ నిర్ణయించింది.
ఇందులో భాగంగా క్లియర్ ట్యాక్స్ కేవలం కార్వీకి చెందిన జీఎస్టీ బిజినెస్‌ను మాత్రమే కొనుగోలు చేయనుంది. ఇందులో 200 మంది ఎంటర్‌ప్రైజ్ కస్టమర్లు, 25 మంది ఉద్యోగులు ఉన్నారు. కార్వీ నుండి టెక్ అసెట్స్, ఎంప్లాయీ అసెట్స్, కస్టమర్ అసెట్స్‌ను కొనుగోలు చేస్తున్నామని, ఎంటిటీ మాత్రం కార్వీదేనని క్లియర్ ట్యాక్స్ సీఈవో అర్చిత్ గుప్తా అన్నారు.


Click it and Unblock the Notifications