బ్యాంకులతో పాటు తన క్లయింట్స్‌ను మోసం చేశారనే ఆరోపణలపై కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్(KSBL) చైర్మన్ సీ పార్థసారథిని హైదరాబాదా సీసీఎస్, డిటెక్టివ్ డిపార్టుమెంట్(DD) పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల కార్వీ సంస్థపై ప్రముఖ బ్యాంకు ఇండస్ఇండ్ బ్యాంకు వైస్ ప్రెసిడెంట్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు చేసిన డిటెక్టివ్ విభాగం పోలీసులు దర్యాఫ్తును ప్రారంభించారు. పార్థసారథి ఇండస్ఇండ్ బ్యాంకులో సెక్యూరిటీలు, షేర్లు తనఖా పెట్టడంతో పాటు వ్యక్తిగత పూచీకత్తుతో బ్యాంకు నుండి రూ.137 కోట్ల రుణం పొందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ రుణాలను తన సొంత అవసరాల కోసం ఇతర బ్యాంకు ఖాతాలకు మళ్లించినట్లు పేర్కొంది. మార్చి 31వ తేదీతో ముగిసిన 2020-21 ఆర్థిక సంవత్సరానికి కార్వీ రుణాలు చెల్లించడంలో విఫలమైనందున చర్యలు తీసుకోవాలని ఇండస్ఇండ్ బ్యాంకు తన ఫిర్యాదులో పేర్కొంది.
తనఖా పెట్టిన సెక్యూరిటీ బాండ్స్, షేర్లు ఖాతాదారులకు తెలియకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడి, వాటిని మోసపూరితంగా బ్యాంకుకు సమర్పించినట్లు విచారణలో వెల్లడైంది. ఆయా ఖాతాదారులు కార్వీలో ఉన్న తమ డీమ్యాట్ అకౌంట్లకు బదిలీ చేసిన సెక్యూరిటీస్‌ను తనఖా పెట్టి మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. రెండేళ్ల నుండి సాగుతున్న ఈ మోసాన్ని 2019 నవంబర్ 22వ తేదీన మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ గుర్తించింది. కార్వీ పైన నిషేధం కూడా విధించింది.

స్టాక్ బ్రోకింగ్ నిర్వహించే KSBLకు దాదాపు రెండు లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. ఇందులో ఆయా కస్టమర్లకు చెందిన డీమ్యాట్ ఖాతాలను చాలా వరకు KSBL నిర్వహించేంది. ఈ క్రమంలో కస్టమర్లకు సంబంధించిన స్టాక్స్‌ను తమ ఖాతాలోకి బదలీ చేసుకొని బదలీ చేసుకున్న వాటిని ఇండస్ఇండ్ బ్యాంకులో మార్చి 2019 నుండి తనఖా పెడుతూ రూ.137 కోట్ల రుణం పొందారు. ఈ రుణం చెల్లించకపోవడంతో ఇండస్ఇండ్ బ్యాంకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాఫ్తు చేసి, పార్ధసారథిని అరెస్ట్ చేశారు.
నిందితులు బ్యాంకుల నుండి భారీగా రుణాలు పొంది రూ.720 కోట్లు ఇతర ఖాతాల్లోకి మళ్లించినట్లు దర్యాఫ్తులో తేలింది. దర్యాఫ్తులో నిందితులు బ్యాంకుల నుండి భారీగా రుణాలు పొంది రూ.720 కోట్లు ఇతర ఖాతాల్లోకి మళ్ళించినట్లు వెలుగు చూసింది. కేవలం ఇండస్ఇండ్ బ్యాంకు మాత్రమే కాకుండా, ఇతర బ్యాంకుల నుండి కూడా ఇలా తమ కస్టమర్స్ షేర్లను సెక్యూరిటీగా పెట్టి రూ.680 కోట్ల వరకు రుణాలు తీసుకున్నట్లు పోలుసులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా కస్టమర్ల షేర్లను తనఖా పెట్టడంతో కార్వీపై గత ఏడాది సెబి నిషేధం విధించింది.
రుణాలు పొంది మోసం చేసిన రెండు కేసుల్లో రూ.347 కోట్లు కాజేసినట్లు సీసీఎస్ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం కేసులన్నీ విచారణలో ఉన్నట్లు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అవినాష్ మహంతి తెలిపారు. ఆయా కేసుల విచారణతో పాటు తాజా కేసుల్లో నిందితుడిగా ఉన్న పార్థసారథిని పోలీసులు జూబ్లీహిల్స్‌లో అదుపులోకి తీసుకున్నారు. అతనిని రిమాండుకు తరలించారు. ఇదిలా ఉండగా బ్యాంకు రుణం ఎగవేత, మనీలాండరింగ్ కేసులో మరో ఎండీని పోలీసులు అరెస్టు చేశారు.
More From GoodReturns

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications