కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ కేసులో 2.35 లక్షల ఇన్వెస్టర్లకు ఇప్పటి వరకు రూ.2,300 కోట్ల విలువైన ఫండ్స్, సెక్యూరిటీస్‌ను సెటిల్ చేసినట్లు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్(NSE) మంగళవారం తెలిపింది. రూ.30వేల వరకు ఉన్న బకాయిలను సెటిల్ చేసినట్లు తెలిపింది. 2.35 లక్షల మంది పెట్టుబడిదారుల డీమ్యాట్ ఖాతాల నుండి అక్రమంగా షేర్లను మళ్లించిందని కార్వీ స్టాక్ బ్రోకింగ్ ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇందులో భాగంగా రూ.2300 కోట్ల మేర పరిష్కరించినట్లు NSE తెలిపింది.
సెబి మార్గదర్శకాల ప్రకారం ఆయా ఖాతాదారులకు సంబంధించిన షేర్లను వారి ఖాతాల్లోకి జమ చేసినట్లు తెలిపింది. క్లియరింగ్ కార్పోరేషన్లలో జమ చేసిన బ్యాంకు హామీలు, కార్వీ గ్రూప్ వద్ద ఉన్న లిక్విడేటెడ్ సెక్యూరిటీలను ఇందుకు వినియోగించినట్లు తెలిపింది. క్రమశిక్షణ చర్యలు కొనసాగుతున్నాయని, చిన్న ఇన్వెస్టర్ల ప్రయోజనాలు కాపాడేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది.

కార్వీ కేసులో ఇప్పటివరకు రూ.2,300 కోట్ల విలువైన షేర్లను మదుపరుల ఖాతాలకు బదిలీ చేసినట్లు ఎన్ఎస్ఈ తాజాగా ప్రకటించడం గమనార్హం. పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా లభించిన ఖాతాదారుల షేర్లను కార్వీ సంస్థ తన అవసరాల కోసం బ్యాంకులు, ఆర్థిక సంస్థల వద్ద తనఖా పెట్టడంతో ఈ కేసు బయటపడింది. దీంతో గత ఏడాది సెబీ... కార్వీ సంస్థను వ్యాపార లావాదేవీల నుంచి నిషేధించింది. సెబీ ఆదేశాలతో స్టాక్ ఎక్స్చేంజీలు ఈ షేర్లను మళ్లీ ఖాతాదారుల ఖాతాలకు బదిలీ చేసేందుకు చర్యలు తీసుకున్నాయి.
More From GoodReturns

ఎర్లీ రిటైర్మెంట్ ప్లాన్ చేస్తున్నారా? మీ దగ్గర ఎంత డబ్బు ఉండాలో చెప్పే మ్యాజిక్ ఫార్ములా ఇదే!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications