Congestion Tax: ఇప్పటివరకు ఆదాయపు పన్ను, ఇంటిపన్ను గురించి అందరూ వింటూనే ఉన్నాం. ఇటీవలే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చెత్త పన్నును సైతం ప్రజలపై మోపాయి. తాజాగా వినియోగదారుల నడ్డి విరిచేందుకు మరో ట్యాక్స్‌ను ప్రవేశపెట్టడానికి ఓ రాష్ట్రం తహతహలాడుతోంది.
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు ట్రాఫిక్ సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. వాహనాల రద్దీ దృష్ట్యా ఎంతో విలువైన సమయం ట్రాఫిక్‌లో దుర్వినియోగమవుతోంది. దీని పరిష్కారానికి బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్(BMTC) రంగంలోకి దిగింది. ఇందుకోసం రద్దీపన్ను విధించాలని భావిస్తోంది.

బెంగళూరులో రోజూ 12 మిలియన్ల వాహనాలు ప్రవేశిస్తున్నట్లు అంచనా. ఫలితంగా ట్రాఫిక్ జామ్ అయి గంటకు దాదాపు 2.8 లక్షల లీటర్ల ఇంధనంతో పాటు ఏటా 60 కోట్ల పనిగంటలు వృథా అవుతున్నాయి. దీనిని కట్టడి చేసేందుకు ట్రాఫిక్ వేళల్లో గుర్తించిన 9 రోడ్లపై రద్దీ పన్ను విధించాలని "కర్ణాటక డికేడ్ - రోడ్‌మ్యాప్ టు $1 ట్రిలియన్ ఎకానమీ" అనే నివేదిక సిఫార్సు చేసింది.
ఔటర్ రింగ్ రోడ్ (ORR), సర్జాపూర్ రోడ్, హోసూర్ రోడ్, ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్, ఓల్డ్ మద్రాస్ రోడ్, బళ్లారి రోడ్, బన్నెరఘట్ట రోడ్, కనకపుర రోడ్, మగడి రోడ్, వెస్ట్ ఆఫ్ కార్డ్ రోడ్ మరియు తుమకూరు రోడ్లపై రద్దీ పన్నులు వసూలు చేయాలని BMTC భావిస్తోంది. తద్వారా ప్రైవేట్ వాహనాల వినియోగాన్ని తగ్గిస్తూ, ప్రజా రవాణాను ప్రోత్సహించాలని భావిస్తోంది. ఇందుకోసం ఫాస్ట్‌ట్యాగ్ సిస్టమ్‌ను ఉపయోగించేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు.
సమయానుగుణంగా నిర్ధిష్ట ప్రాంతాల్లోకి ప్రవేశించిన వాహనాలపై ఈ రద్దీ పన్ను విధిస్తారు. ట్రాఫిక్ కట్టడితో పాటు వాయు కాలుష్యం తగ్గింపు కోసం ఇది ఉపయోగపడుతుంది. మన దేశంలో దీనిపై వ్యతిరేకత ఉన్నప్పటికీ.. లండన్, స్టాక్ హోమ్, సింగపూర్ వంటి పలు అంతర్జాతీయ నగరాలు విజయవంతంగా అమలు చేస్తున్నాయి. ఇదే వ్యవస్థ భవిష్యత్తులో దేశంలోని ఇతర నగరాలకూ విస్తరించవచ్చని భావిస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications