మరో రెండు రోజుల్లో ఉగాది ఇంకా ఈద్ పండుగలు రాబోతున్నాయి. అయితే ఈసారి ఉగాది పండుగ ఆదివారం, ఈద్ సోమవారం రోజున రానుంది. దీనికి తోడు రేపు శనివారం, దింతో స్కూల్స్, కాలేజెస్ ఇంకా ఉద్యోగాలు చేసేవారికి వరుసగా హాలీడేస్ రానున్నాయి. ఈ తరుణంలో ఉగాది ఇంకా ఈద్ అల్-ఫితర్ పండుగల సందర్భంగా సొంత ఊరు, ప్రయాణాలు చేసేవారికి సౌకర్యాలు కల్పించడానికి అదనపు బస్సులను నడపనున్నట్లు కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) తాజాగా ప్రకటించింది. ఈ రోజుల్లో అంచనా వేసినట్లుగా అధిక రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ పండుగల సమయంలో 2 వేల అదనపు బస్సులు నడపనున్నట్లు కర్ణాటక స్టేట్ RTC తెలిపింది.

మార్చి 30న ఉగాది పండుగ, మార్చి 31న ఈద్ అల్-ఫితర్ జరుపుకునే అవకాశం ఉండటంతో బెంగళూరుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు వివరాలు అందిస్తూ పేర్కొన్నారు. మార్చి 28 నుండి 30 మధ్య బెంగళూరు నుండి వివిధ ప్రాంతాలకు అదనపు బస్సులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ గమ్యస్థానాల నుండి కర్ణాటక రాజధానికి తిరిగి వచ్చే సర్వీసులు మార్చి 31 వరకు అందుబాటులో ఉంటాయని అధికారిక ప్రకటన సూచించింది. మరిన్ని వివరాలను అందిస్తూ బెంగళూరులోని కెంపెగౌడ బస్ స్టేషన్ నుండి ధర్మస్థల, కుక్కేసుబ్రమణ్య, శివమొగ్గ, హసన్, మంగళూరు, కుందపుర, శృంగేరి, హొరనాడు, దావణగెరె, హుబ్బళ్లి, ధార్వాడ్ వంటి వివిధ గమ్యస్థానాలకు మరిన్ని బస్సులు నడుస్తాయని అధికారులు తెలిపారు.
అంతే కాకుండా బెలగావి, విజయపుర, గోకర్ణ, సిర్సి, కార్వార్, రాయచూర్, కలబురగి, బళ్లారి, కొప్పాల, యాద్గిర్, బీదర్, తిరుపతి, విజయవాడ, హైదరాబాద్ ఇంకా ఇతర ప్రాంతాలకు కూడా బస్సులు నడుస్తాయి. మైసూరు రోడ్ బస్ స్టేషన్ నుండి బస్సులు మైసూరు, హున్‌సూరు, పిరియాపట్న, విరాజ్‌పేట, కుశాలనగర్ అలాగే మడికేరికి వెళ్తాయని అధికారులు తెలిపారు.
శాంతినగర్‌లోని BMTC బస్ స్టేషన్ నుండి తమిళనాడు అండ్ కేరళలోని గమ్యస్థానాలకు KSRTC ప్రీమియం సేవలను కూడా నిర్వహిస్తుందని అధికారిక ప్రకటన పేర్కొంది. ఈ బస్సులు మధురై, కుంభకోణం, చెన్నై, కోయంబత్తూర్, తిరుచ్చి, పాలక్కాడ్, త్రిస్సూర్ ఇంకా కోజికోడ్ వంటి ఇతర నగరాలకు ప్రయాణిస్తాయి. కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ సిస్టమ్ ద్వారా ప్రయాణికులు ప్రత్యేక సేవలకు ప్రి బుకింగ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ పండుగల సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రయాణించే అవకాశం ఉన్నందున, రద్దీని నియంత్రించడానికి ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..



Click it and Unblock the Notifications