RTC News: కర్ణాటక ఆర్టీసీ కిల్లింగ్ ప్లాన్.. పాత బస్సులతో కొత్త బిజినెస్
Karnataka RTC: కాలం మారుతున్న కొద్దీ వినూత్న ఆలోచనలతో కొత్తకొత్త బిజినెస్ ఐడియాలు పుట్టుకొస్తున్నాయి. ఇదే తరహాలో ఆర్టీసీ అధికారులు ఇటీవల పార్సిల్ సర్వీసులను మొదలుపెట్టారు. గతంలో కేరళ ఆర్టీసీ ప్రారంభించిన వ్యాపార ఐడియాను కర్ణాటక సైతం ఫాలో అవుతోంది.
పాతబడిన, రోడ్డుపై తిరిగేందుకు పనికిరాని వాహనాలను ఉపయోగించి కర్ణాటక ఆర్టీసీ ఓ బిజినెస్ స్టార్ట్ చేసింది. మొబైల్ క్యాంటీన్లుగా ఆ బస్సులను వినియోగిస్తోంది. తుక్కు కింద ఇనుమును కిలోల లెక్కన విక్రయించడం కంటే ఈ ఐడియా మంచి ఆదాయం తెచ్చి పెడుతుందని భావిస్తోంది.

కాలం చెల్లిన బస్సులను రీమోడిఫై చేసి 'హోటల్ ఆన్ వీల్స్'గా తిప్పుతోంది. అప్పటికప్పుడు వివిధ రకాల టిఫిన్స్ సహా ఆహారాన్ని తయారుచేసి ప్రయాణీకులకు అందించేందుకు ప్లాన్ చేసింది. వీటితో పాటు టీ, కాఫీలను సైతం విక్రయించేందుకు అనువుగా ఒక్కో పాత బస్సును మినీ హోటల్‌గా మార్చేసింది.
అదే బస్సులో టేబుల్, కుర్చీలను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. నీటి అవసరాలు తీర్చుకునేందుకు బస్సుపైన చిన్నపాటి ట్యాంక్ పెట్టింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు స్వయం ఉపాధి కింద వీటిని నిర్వహించే అవకాశం కల్పిస్తోంది. హాస్పిటల్స్, బస్టాండ్స్, రైల్వే స్టేషన్లు, పార్కులు వంటి జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో వీటిని మొబైల్ క్యాంటీన్లుగా వినియోగిస్తోంది.


Click it and Unblock the Notifications