కర్ణాటకలో నమోదు అయిన వాహనదారులకు ఇతర రాష్ట్రాల్లో బిగ్ షాక్ ఎదురవుతోంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే.. కర్ణాటక ప్రభుత్వ కాలుష్య నియంత్రణ ధృవీకరణ పత్రం (PUCC) డేటాబేస్ కేంద్ర ప్రభుత్వ వాహన (పరివాహన్) పోర్టల్‌తో అనుసంధానించబడకపోవడమేనని చెప్పవచ్చు. ఈ సాంకేతిక లోపం వల్ల, చెల్లుబాటు అయ్యే PUCC ఉన్నప్పటికీ.. ఒడిశా, గోవా వంటి రాష్ట్రాల్లో కర్ణాటక-రిజిస్టర్డ్ వాహనాలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు భారీ జరిమానాలు విధిస్తున్నాయి అక్కడి ప్రభుత్వాలు.
కర్ణాటక రాష్ట్రం PUCCల కోసం ప్రత్యేకంగా etc.karnataka.gov.in అనే పోర్టల్‌ను నిర్వహిస్తోంది. అయితే ఈ పోర్టల్ జాతీయ స్థాయి పరివాహన్ (Vahan/Parivahan) డేటాబేస్‌తో లింక్ కాలేదు. ఫలితంగా, ఇతర రాష్ట్రాల్లో అమలులో ఉన్న AI-ఆధారిత ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కెమెరాలు, ఆటోమేటెడ్ ఈ-డిటెక్షన్ సిస్టమ్‌లు, పరివాహన్ డేటాను ఆధారంగా తీసుకుని PUCC చెల్లుబాటును తనిఖీ చేస్తున్నాయి. అక్కడ కర్ణాటక PUCC వివరాలు కనిపించకపోవడంతో వాహనాలను 'PUCC గడువు ముగిసినవి'గా ఫ్లాగ్ చేసి ఆటోమేటిక్‌గా ఈ-చలాన్లు జారీ చేస్తున్నాయి.

మోటారు వాహనాల చట్టం ప్రకారం.. చెల్లుబాటు అయ్యే కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ లేకుండా వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా విధించవచ్చు. ఇదే నిబంధన ఆధారంగా, సిస్టమ్‌లు కర్ణాటక వాహనదారులకు నోటీసులు పంపుతున్నాయి. ముఖ్యంగా ఒక సంవత్సరం కంటే పాత వాహనాలు ఈ సమస్యకు ఎక్కువగా గురవుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు. ఎందుకంటే కొత్త వాహనాలకు మొదటి సంవత్సరం వరకు PUCC అవసరం ఉండదు; ఆ తర్వాత నుంచి పరివాహన్ డేటాబేస్‌లో నమోదు లేకపోవడం సమస్యగా మారుతోంది.
ఈ అంశంపై కర్ణాటక రవాణా మంత్రి ఆర్. రామలింగ రెడ్డి స్పందిస్తూ.. ఈ విషయాన్ని రవాణా కమిషనర్‌తో చర్చిస్తాం మేము దీనిని సరిదిద్దుతామని మనీకంట్రోల్‌కు తెలిపారు. అయితే రవాణా కార్యదర్శి ఎన్వీ ప్రసాద్, రవాణా కమిషనర్ ఏఎం యోగేష్ ఈ విషయంలో వ్యాఖ్యానించడానికి అందుబాటులో లేరు. ఈ సమస్యను అనేక మంది వాహనదారులు సోషల్ మీడియా వేదిక X ద్వారా వెలుగులోకి తీసుకువచ్చారు.
బెంగళూరు నుంచి ఒడిశాకు ప్రయాణిస్తున్న సమయంలో తనకు రూ.20 వేలు జరిమానా విధించారని ఆశిష్ బలియార్‌సింగ్ వెల్లడించారు. డిసెంబర్ 2026 వరకు చెల్లుబాటు అయ్యే PUCCతో సహా అన్ని చెల్లుబాటు అయ్యే పత్రాలు ఉన్నప్పటికీ తప్పుడు చలాన్లు జారీ చేశారని ఆయన వాపోయారు. ఇదే విధంగా, ఒడిశా కెమెరాలు కర్ణాటక PUCCలను గుర్తించడం లేదని సమీర్ రంజన్ బక్షి తెలిపారు.
గోవాలో మొల్లెం ప్రాంతం గుండా ప్రయాణించే వాహనాలకు, చెల్లుబాటు అయ్యే సర్టిఫికెట్లు ఉన్నప్పటికీ PUCC మిస్ అయినట్లు చూపించి రూ.10 వేలు ఆటోమేటెడ్ చలాన్లు జారీ అవుతున్నాయని దీపక్ షెనాయ్ తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించాలంటే పని దినాల్లో మధ్యాహ్నం 2 గంటలలోపు ఆర్టీఓను స్వయంగా సందర్శించాల్సి వస్తోందని, ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియగా మారిందని ఆయన పేర్కొన్నారు. వాహనదారులు అభిప్రాయం ప్రకారం.. ఇది వాహనం రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన సమస్య కాదు. కర్ణాటక PUCC వ్యవస్థ, జాతీయ పరివాహన్ ప్లాట్‌ఫామ్ మధ్య సమగ్ర ఏకీకరణ లేకపోవడమే అసలు కారణం. ఈ నేపథ్యంలో, కేంద్ర-రాష్ట్ర స్థాయి సమన్వయం పెంచి.. డేటాబేస్‌లను త్వరగా అనుసంధానించాల్సిన అవసరం ఉందని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications