తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు అనువైనదిగా పరిగణిస్తున్నాయి ప్రముఖ కంపెనీలు. ఇందుకు ఉదాహరణే ఈ డీల్. కళ్ళద్దాల తయారీ, రిటైలర్ లెన్స్‌కార్ట్ డిసెంబర్ తాజాగా తెలంగాణ ప్రభుత్వంతో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ ఐటీ, పరిశ్రమలు అండ్ వాణిజ్యం, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు దీనికి సంబంధించి ట్వీట్ చేస్తూ "ఈరోజు లెన్స్‌కార్ట్.కామ్‌తో ఎంఓయూపై సంతకం చేయడం ఆనందంగా ఉంది. రూ. 1,500 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో ప్రపంచంలోనే అతిపెద్ద కళ్ళద్దాల తయారీ ప్లాంట్‌ను లెన్స్‌కార్ట్ ప్రారంభించనుంది అంటూ పోస్ట్ చేసారు.
భారతీయ మార్కెట్‌తో పాటు సౌత్ ఈస్ట్ ఆసియ, మిడిల్ ఈస్ట్రన్ దేశాలకు ఎగుమతి చేయడానికి ఈ ఉత్పత్తులు తయారు చేయనుంది. ఈ తయారీ కర్మాగారంలో సుమారు 2,100 ఉద్యోగావకాశాలు సృష్టించనుంది. ఇందుకు సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు మరిన్ని చర్చలు జరుగుతున్నాయి అని అన్నారు.

ఫ్యాబ్ సిటీలో కొత్త తయారీ యూనిట్
ఫ్యాబ్‌సిటీలో కంపెనీ కొత్త యూనిట్‌ను ఏర్పాటు చేయబోతోంది. ఇప్పటికే అనువైన స్థలాన్ని గుర్తించడం జరిగింది. కంపెనీలు త్వరగా ఇంకా సులభంగా వ్యాపారాలను ఏర్పాటు చేసుకునేందుకు వీలు కల్పించే మా విధానానికి ఇది నిదర్శనమని ఆయన అన్నారు. ఈ వారంలోనే భూమిని కంపెనీకి అప్పగించే అవకాశం కూడా ఉంది
రాష్ట్రానికి 1,500 కోట్ల పెట్టుబడి నష్టం
రాష్ట్రంలో లెన్స్‌కార్ట్ యూనిట్‌ను ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇందుకు పెట్టుబడి అవకాశం కోసం లెన్స్‌కార్ట్ కర్ణాటక రాష్ట్రాన్ని వెతుక్కుంటూ వచ్చింది. అయితే ప్రాజెక్ట్ విఫలమైంది చివరికి కర్ణాటక రాష్ట్రం 1,500 కోట్లు పెట్టుబడిని కోల్పోయింది. మరోవైపు అక్కడి రాష్ట్ర మంత్రి ఎంబీ పాటిల్ కంపెనీ ఏర్పాటుకు సహకరించేందుకు అంగీకరించారు ఏప్రిల్ 2014లో కంపెనీ సహ వ్యవస్థాపకుడు అండ్ CEO బెంగళూరు విమానాశ్రయానికి 60 కిలోమీటర్ల పరిధిలో 25 ఎకరాల భూమిని కోరుతూ లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేశారు. చాలా వేగంగా స్పందించిన కర్ణాటక భారీ, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్.. పరిశ్రమల శాఖ అన్ని రకాల సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. సంబంధిత అధికారులు కూడా మిమ్మల్ని సంప్రదిస్తారని ఆయన ట్వీట్ చేశారు. అయితే చివరికి ఎం జరిగింది అన్నది వెల్లడి కానప్పటికీ ప్రస్తుతం అదే పెట్టుబడిని తెలంగాణకు మళ్లించడం వల్ల కర్నాటక రాష్ట్రం 1,500 కోట్ల పెట్టుబడులను కోల్పోయింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications