Bengaluru: బెంగళూరులో ఇకపై ఆ ఉద్యోగం చేసినా నెలకు రూ. 23 వేలు పక్కా.. గవర్నమెంట్ కొత్త రూల్!
బెంగళూరు (Bengaluru) అనగానే ఐటీ ఉద్యోగాలు, లక్షల ప్యాకేజీలు గుర్తొస్తాయి. కానీ అక్కడ చిన్న చిన్న పనులు చేసుకునే సాధారణ కార్మికుల పరిస్థితి ఏంటి? ఖర్చులు చూస్తేనేమో ఆకాశంలో ఉన్నాయి, జీతాలు చూస్తేనేమో తక్కువగా ఉన్నాయి. అయితే, ఇలాంటి వర్కర్లందరికీ కర్ణాటక ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. బెంగళూరు సిటీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్మికుల కనీస వేతనాలను (Minimum Wages) భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
కొత్త రూల్స్ ప్రకారం.. గ్రేటర్ బెంగళూరు పరిధిలో ఎలాంటి నైపుణ్యం లేని (Unskilled) సాధారణ కార్మికుడికి కూడా ఇకపై నెలకు కనీసం రూ. 23,376 జీతం ఇవ్వాల్సిందే. అలాగే బాగా అనుభవం, నైపుణ్యం ఉన్న (Highly Skilled) వర్కర్ల కనీస వేతనాన్ని నెలకు రూ. 31,114 గా ఫిక్స్ చేశారు.

ఒకేసారి 60 శాతం పెంపు!
కర్ణాటక కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ మాట్లాడుతూ.. కార్మికుల కనీస వేతనాలను ఏకంగా 60 శాతం పెంచినట్లు ప్రకటించారు. కార్మికులు ఎప్పటి నుంచో కోరుతున్న డిమాండ్‌ను నెరవేర్చామని, దీనివల్ల వారికి ఆర్థిక భద్రత లభిస్తుందని ఆయన చెప్పారు.
సాధారణంగా ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఈ కనీస వేతనాలను సవరిస్తుంటారు. అంతకుముందు కర్ణాటకలో అన్‌స్కిల్డ్ వర్కర్ల కనీస వేతనం కేవలం రూ. 15,000 ఆస్పాస్‌లో మాత్రమే ఉండేది. ఇప్పుడు పెరిగిన ఈ కొత్త జీతాల వల్ల అటు ఆర్గనైజ్డ్, ఇటు అన్‌ఆర్గనైజ్డ్ రంగాల్లో ఉన్న దాదాపు రెండు కోట్ల మంది కార్మికులకు భారీ లబ్ధి చేకూరనుంది.
బెంగళూరు దాటితే జీతాలు ఎలా ఉన్నాయి?
ఈ జీతాల పెంపును ఏరియాలను బట్టి మూడు జోన్లుగా విభజించారు. బెంగళూరులో ఖర్చులు ఎక్కువ కాబట్టి అక్కడ జీతాలు ఎక్కువగా ఉంటాయి.
- జోన్ 1 (గ్రేటర్ బెంగళూరు): అన్‌స్కిల్డ్ వర్కర్లకు కనీసం రూ. 23,376.
- జోన్ 2 & 3 (మిగతా జిల్లాలు, ప్రాంతాలు): బెంగళూరు వెలుపల ఉండే ప్రాంతాల్లో పనిని బట్టి కనీస వేతనం రూ. 19,300 నుండి రూ. 21,251 వరకు ఉంటుంది.
కోర్టు తీర్పు ఆధారంగా ఒక మనిషికి కావలసిన కూడు, గుడ్డ, నీడ, పిల్లల చదువు , వైద్య ఖర్చులను బేస్ చేసుకుని కనీస వేతనాలను నిర్ణయించాలని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఒక ల్యాండ్‌మార్క్ జడ్జిమెంట్ (Reptakos Brett కేస్) ఆధారంగా కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
మొదలైన కొత్త తలనొప్పులు!
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కార్మికులకు సంతోషాన్నిచ్చినప్పటికీ, వ్యాపారవేత్తలు , కంపెనీల యాజమాన్యాలు మాత్రం లబోదిబోమంటున్నాయి. కర్ణాటక ఎంప్లాయర్స్ అసోసియేషన్ (KEA) ఈ పెంపు చాలా ఎక్కువ అని, దీనివల్ల బిజినెస్‌లు నడపడం కష్టమవుతుందని అంటోంది.
అంతేకాదు, ఈ కొత్త జీతాల నోటిఫికేషన్‌లో కొన్ని లీగల్ సమస్యలు ఉన్నాయని KEA ప్రెసిడెంట్ బి.సి. ప్రభాకర్ చెబుతున్నారు. నవంబర్ 2025 నుండి అమలులోకి వచ్చిన కొత్త 'కోడ్ ఆన్ వేజెస్' ప్రకారం పాత చట్టాలకు విలువ లేదని, పైగా దీనిపై హైకోర్టు స్టే కూడా ఉందని వారు వాదిస్తున్నారు. ఈ పెంపుదలపై కేబినెట్‌లోని కొందరు మంత్రులు కూడా మొదట్లో అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా, బెంగళూరు కార్మికులకు మాత్రం ఇది పెద్ద ఊరట కలిగించే విషయమే!


Click it and Unblock the Notifications