ఇటీవల బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 4న చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో ఒక కొత్త భారీ స్థాయి మల్టీపర్పస్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇటీవల మీడియాకు ఇచ్చిన ప్రకటనలో మాట్లాడుతూ, ఈ కొత్త స్టేడియం సుమారు 60,000 మందికి కూర్చునే అవకాశం కలిగి ఉంటుంది అని వెల్లడించారు. కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా, ఇతర క్రీడలు, జాతీయ-అంతర్జాతీయ ఈవెంట్స్, కన్ఫరెన్స్‌లు, సాంస్కృతిక కార్యక్రమాలు మొదలైనవి కూడా ఈ స్టేడియంలో నిర్వహించేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ ప్రాథమిక లక్ష్యం భద్రతతో కూడిన మెరుగైన క్రౌడ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ కలిగి ఉంటుంది అని చెప్పుకొచ్చారు. తొక్కిసలాట వల్ల ప్రజల్లో ఏర్పడిన భయాన్ని తీసివేసేందుకు ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది అని చెప్పుకొచ్చారు. కొత్తగా నిర్మించనున్న స్టేడియంలో ఆధునిక టెక్నాలజీ ద్వారా పర్యవేక్షణ, వెంటనే స్పందన ఇచ్చే టీమ్‌లు, విస్తృత ప్రవేశం మరియు ఎక్కువ ఎగ్జిట్ మార్గాలను ఏర్పాటు చేయనున్నారు.
ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు 50 ఎకరాల భూమిని ప్రభుత్వం ఎంపిక చేసింది. స్టేడియాన్ని నగరానికి కొంచెం దూరంలో కానీ, కొత్తగా అభివృద్ధి చేస్తున్న ప్రాంతాల్లో నిర్మించాలనే ఆలోచనలో ఉన్నారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి, అలాగే పెద్ద ఈవెంట్ల సమయంలో నగర మౌలిక వసతులపై ఒత్తిడి పడకుండా ఉంటుంది అని చెప్పుకొచ్చారు.
ఈ ప్రాజెక్ట్ కేవలం ఒక స్టేడియం నిర్మాణామే కాదు, ఇది బెంగళూరును జాతీయ స్థాయిలో ఓ ప్రధాన క్రీడా కేంద్రంగా మార్చే దిశగా ఉంటుంది అని అన్నారు. IPL వంటి పెద్ద లీగ్‌లు, అంతర్జాతీయ మ్యాచ్‌లు, మరియు వేదికల అవసరం ఉన్న ఇతర కార్యక్రమాలకు ఈ స్టేడియం ద్వారా మరింత ప్రోత్సాహం పొందనున్నాయి.
ప్రాజెక్ట్‌కు సంబంధించిన నిర్మాణ కాలం, ఖర్చు వివరాలు, ఆర్థిక మద్దతు వంటి విషయాలపై ప్రభుత్వం త్వరలో స్పష్టత ఇవ్వనుంది. ప్రజల భద్రతను ప్రాధాన్యతగా తీసుకుని, సమాచారం అందించడం జరుగుతుందని చెప్పారు.


Click it and Unblock the Notifications