హైదరాబాదును టార్గెట్ చేసిన కర్ణాటక.. రూ.40 వేల కోట్ల మెగా ప్లాన్, ఇక కష్టమే..
KHIR City: అనేక సంవత్సరాలుగా ఐటీ, బ్యాంకింగ్ పరిశ్రమలకు గమ్యస్థానంగా మారిన హైదరాబాద్ నగరం బెంగళూరుతో పోటీ పడుతూనే ఉంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం హెల్త్, ఏఐ, ఆటో, టిప్ టెక్నాలజీ వంటి అనేక ఇకర రంగాపై దృష్టి సారిస్తోంది. దీనికి తగినట్లుగా పోటీ ఇచ్చేందుకు కర్ణాటక మెగా నగరాన్ని నిర్మించాలని చూస్తోంది.
భారత స్టార్టప్ రాజధానిగా పేరుగాంచిన బెంగళూరును దాటి అభివృద్ధిపై దృష్టి సారించాలని కర్ణాటక ప్రభుత్వం ప్రస్తుతం నిర్ణయించింది. ఇందుకోసం అనుబంధ నగరాన్ని అభివృద్ధి చేయాలని చూస్తోంది. ఈ క్రమంలో బెంగళూరుకు సమీపంలో రూ.40,000 కోట్ల పెట్టుబడితో కొత్త నగరాన్ని నిర్మించాలని ప్లాన్ చేసింది. కొత్తగా ఏర్పాటు కానున్న నగరం దాదాపు 80 వేల ఉద్యోగావకాశాలను సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు. KHIR సిటీ పేరుతో దీనిని నిర్మించనున్నారు.

కొత్తగా స్థాపిస్తున్న నాలెడ్జ్, హెల్త్, ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ నగరం బెంగళూరుకు 60 కిలోమీటర్ల దూరంలో తబస్పేట్, దోపబాలాపూర్ ప్రాంతంలో ఉండనుంది. వీలైనంత త్వరగా ఈ నగర నిర్మాణానికి సీఎం సిద్ధరామయ్య శంకుస్థాపన చేయనున్నారు. 2 వేల ఎకరాల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేస్తుండగా.. మెుదటి దశలో 500 ఎకరాల్లో పనులు చేపట్టాలని చూస్తున్నారు. తొలుత ఈ నగరానికి సంబంధించిన ప్రాజెక్టు పనులు ఆగస్టులోనే ప్రారంభం కావాల్సి ఉండగా.. కర్ణాటక ప్రభుత్వం సెప్టెంబర్ లేదా అక్టోబర్‌కు వాయిదా వేసింది.
కొత్తగా నిర్మిస్తున్న నగరంలో వ్యాపారం చేసేందుకు ఆటోమొబైల్, సెమీ కండక్టర్, ఏరోస్పేస్ తదితర బడా కంపెనీలను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దీని ఏర్పాటు బెంగుళూరు శివారు ప్రాంతంలో జరుగుతోంది. దీని ద్వారా కర్ణాటక జీడీపీ గణనీయంగా పెరుగుతుందని పరిశ్రమల శాఖ మంత్రి ఎంపీ పాటిల్ తెలిపారు. అంతర్జాతీయ నగరాలన్నింటికి మోడల్ సిటీగా నిలుస్తుందని చెప్పారు. ప్రస్తుతం బెంగళూరులో జనాభా పెరుగుదలతో ట్రాఫిక్ రద్దీ సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. కొత్తగా నగరాన్ని ఏర్పాటు ద్వారా శివారులో విస్తరణ ప్రణాళిక సమస్యలకు పరిష్కారం అందిస్తుందని అక్కడి అధికారులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications