KHIR Innovation City: తెలంగాణలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి అంతర్గత సవాళ్లతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి అభివృద్ధి విషయంలో పెద్ద సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఏఐ సాంకేతికలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇప్పటికే భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి పునాదులు వేస్తున్నారు.
ఈ క్రమంలోనే తెలంగాణ టెక్ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూరు నుంచి మరో కొత్త సవాలుకు సిద్ధం కావాల్సి ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం అభివృద్ధిని తర్వాతి స్థాయిలకు తీసుకెళ్లేందుకు నాలెడ్జ్ హెల్త్ ఇన్నోవేషన్ రీసెర్చ్-సిటీ ప్రాజెక్టుతో సవాలు విసిరేందుకు సిద్ధమౌతోంది. దేశంలోనే తొలిసారిగా ఇలాంటి ప్రాజెక్టుకు రూపకల్పన జరుగుతోందని తెలుస్తోంది. దీనిని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సెప్టెంబర్ 26, 2024న ప్రారంభించనున్నారు.

సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ వినూత్న నగరాన్ని దాదాపు 2000 ఎకరాల విస్తీర్ణంలో కొత్త నగరాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ KHIR సిటీ ప్రాజెక్టు కోసం ఏకంగా రూ.40 వేల కోట్లను వెచ్చించాలని నిర్ణయించారు. మెుదటి దశలో ఈ ప్రాజెక్టును 500 ఎకరాల్లో అభివృద్ధిని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రాజెక్టు ప్రత్యక్షంగా అలాగే పరోక్షంగా కలిపి దాదాపు లక్ష మందికి ఉద్యోగ అవకాశాన్ని కల్పించనుందని కర్ణాటన ప్రధాన పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్ ఆదివారం ప్రకటించారు. సింగపూర్‌కు చెందిన బయోపోలిస్, రీసెర్చ్ ట్రయాంగిల్ పార్క్, సైన్స్ పార్క్, కెబీఐసీ, బోస్టన్ ఇన్నోవేషన్ క్లస్టర్ వంటి అంతర్జాతీయ నమూనాల నుంచి ఈ ప్రాజెక్ట్ స్ఫూర్తి పొందిందని మంత్రి చెప్పారు.
పారిశ్రామికవేత్తల అవసరాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 50 కిలోమీటర్ల దూరంలో నిర్మిస్తున్నారు. సకాలంలో ప్రాజెక్ట్ పురోగతిని నిర్ధారించడానికి డాక్టర్ దేవి శెట్టి, కిరణ్ మజుందార్-షా, ప్రశాంత్ ప్రకాష్, థామస్ ఓషా, రాన్ కింబాల్, మోహన్‌దాస్ పాయ్, నిఖిల్ కామత్ వంటి ప్రముఖులతో కూడిన సలహా కమిటీని కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నగరం ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, వినూత్న పరిశ్రమలు, పరిశోధనా సంస్థలకు నిలయంగా ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.
ఇప్పటికే రద్దీగా మారిన బెంగళూరు నగరంలో ప్రజలకు ప్రయాణ సమస్యలు పెద్ద అవరోధంగా మారాయి. ఉద్యోగాలకు వెళ్లాలన్నా గంటల తరబడి ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటున్న వేళ.. కొత్త అభివృద్ధిని బెంగళూరు నగర శివార్లకు మార్చటం ప్రజల కష్టాలను తగ్గిస్తుందని ప్రజలు సైతం ఆకాంక్షిస్తున్నారు. అలాగే కొత్త ఉపాధి అవకాశాలు వస్తాయని యువత సైతం సంతోషం వ్యక్తం చేస్తోంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications