కర్ణాటక రాష్ట్రం మహిళా ఉద్యోగుల కోసం పెద్ద పద్దతిలో కొత్త పాలసీని ఆమోదించింది. 2025 అక్టోబర్ 9న కేబినెట్ "'మెన్స్ట్రువల్ లీవ్ పాలసీ, 2025" ని ఆమోదించింది. ఈ పాలసీ ప్రకారం మహిళా ఉద్యోగులు ప్రతి నెల ఒక రోజు జీతం పొందే సెలవు తీసుకోవచ్చు.
ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగాలకే కాదు. రాష్ట్రంలోని ప్రైవేట్ కంపెనీలు, ఐటి ఫిర్మ్స్, MNCs, గార్మెంట్ యూనిట్స్ కూడా ఈ పాలసీ కింద వస్తాయి. మొదట సంవత్సరానికి ఆరు రోజుల సెలవు ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినప్పటికీ, తర్వాత లేబర్ డిపార్ట్‌మెంట్ దీన్ని ప్రతి నెల ఒక్క రోజుకి మార్చింది.

కర్ణాటక ప్రభుత్వం ముందుగా 18 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మహిళల హక్కులను కాపాడడం, మెన్స్ట్రువల్ సమయంలో ఉపయోగించే ఉత్పత్తులను ఉచితంగా అందించడం వంటి అంశాలపై ఒక బిల్‌ను సిద్ధం చేసింది. ఇక ప్రైవేట్ సెక్టార్ లో కూడా కొన్ని కంపెనీలు ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఉదాహరణకు "స్విగ్గీ", మహిళా డెలివరీ వర్కర్లకు "ప్రతి నెల రెండు రోజుల సెలవు", మరియు జొమాటో, ఏడాదికి 10 రోజుల జీతపొందే సెలవును ఇస్తుంది.
ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి విధానాలు అమలు చేస్తున్నారు. బీహార్ 1992 నుండి ప్రతి నెల రెండు రోజుల సెలవు అందిస్తుంది. 2023లో కేరళ రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో చదివే మహిళా విద్యార్థుల కోసం మెన్స్ట్రువల్ లీవ్ విధానాలు ప్రవేశపెట్టింది. 2024 ఆగస్టులో ఒడిశా మహిళలకు ప్రతి నెల ఒక్క రోజు సెలవు ఇచ్చే విధానం ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా కూడా జపాన్, స్పెయిన్, ఇండోనేషియా, సౌత్ కొరియా, వియత్నాం, ఫిలిప్పీన్స్, తైవాన్ వంటి దేశాల్లో మహిళలకు మెన్స్ట్రువల్ సెలవులు కల్పిస్తున్నారు.
2024 జూలైలో, సుప్రీం కోర్ట్ ఈ అంశం పై గమనించింది. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మెన్స్ట్రువల్ సెలవులను తీసుకునే విధానాలను పరిగణించాలి అని సూచించింది. ప్రధాన న్యాయమూర్తి "డివై చంద్రచూడ్", ఇది మహిళల వర్క్ ఫోర్స్ లో భాగస్వామ్యాన్ని పెంచే అవకాశం ఉన్నా కొంతమంది కంపెనీలు మహిళలను నియమించడంలో వెనకడుగు వేస్తున్నారు అని చెప్పడం గుర్తుంచుకున్నారు.
2017లో, అరుణాచల్ప్రదేశ్ ఎంపీ "నినాంగ్ ఎరింగ్" 'మెన్స్ట్రువేషన్ బెనిఫిట్ బిల్'ను ప్రవేశపెట్టారు. ఇందులో మహిళలకు ప్రతి నెల రెండు రోజుల జీతం పొందే సెలవు ఇవ్వాలని ప్రతిపాదన ఉంది కానీ అది ఇంకా ఆమోదం పొందలేదు.
కర్ణాటక పాలసీ వెనుక ముఖ్య ఉద్దేశ్యం మహిళల ఆరోగ్యం, వర్క్‌ప్లేస్ సౌకర్యం. మెన్స్ట్రువల్ సమయంలో సెలవు తీసుకోవడం స్టిగ్మా లేకుండా, భయమ లేకుండా సౌకర్యవంతంగా ఉండే వాతావరణాన్ని సృష్టించడానికి దీని ఉద్దేశం. భారతదేశంలో దేశవ్యాప్తంగా మెన్స్ట్రువల్ లీవ్ చట్టం లేకపోయినా, బీహార్, ఒడిశా వంటి రాష్ట్రాలు, కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఇప్పటికే ఇలాంటి విధానాలు ప్రవేశపెట్టాయి.
More From GoodReturns

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications