Karan Adani: ప్రస్తుతం అదానీ గ్రూప్ చాలా జాగ్రత్తగా తన వ్యాపార విస్తరణను ప్లాన్ చేస్తోంది. గతంలో మాదిరిగా కాకుండా పందా మార్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
అదానీ గ్రూప్ ప్రస్తుతం లాభాలు తక్కువగా ఉన్న, నష్టాల్లో ఉన్న వ్యాపారాలను విక్రయిస్తూ.. కోర్ బిజినెస్ పై తన ఫోకస్ పెంచుతోంది. ఇందులో భాగంగానే కంపెనీ ఇటీవల కొన్ని పెట్టుబడుల నిర్ణయాలను వెనక్కి తీసుకోవటం జరిగింది. ఈక్రమంలోనే అదానీ పోర్ట్స్ శ్రీలంకలోని కోలంబో పోర్టులో నిర్మిస్తున్న కంటైనర్ టెర్మినల్ నిర్మాణానికి అమెరికా తన పెట్టుబడి సాయంగా 553 మిలియన్ డాలర్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇది ఇన్వెస్టర్లలో సైతం మంచి నమ్మకాన్ని పెంచింది.

ఇదే క్రమంలో అదానీ గ్రూప్ సీఈవో కరణ్ అదానీ తమ వ్యాపార విస్తరణ ప్రణాళికలను బయటపెట్టారు. మంచి లాభాలను తెచ్చిపెడుతున్న పోర్ట్స్ వ్యాపారాన్ని ఇతర దేశాలకు విస్తరించాలని చూస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్, తూర్పు ఆఫ్రికా దేశాల్లో, దక్షిణ ఆసియా దేశాల్లో పెట్టుబడులపై ఆసక్తిగా ఉన్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఇజ్రాయెల్, శ్రీలంకలో పోర్ట్స్ వ్యాపారాన్ని ప్రారంభించిన అదానీ గ్రూప్ ఈ జాబితాలో టాంజానియా, వెనెజువలాలను సైతం యాడ్ చేస్తోంది.
అదానీ గ్రూప్ పోర్ట్స్ అండ్ సెజ్ వ్యాపారాన్ని పరిశీలిస్తే.. 90 శాతం ఆదాయాలు పోర్ట్ ఖాతాల నుంచి వస్తున్నట్లు వెల్లడైంది. అయితే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు కంపెనీ తన వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తున్నందున ఈ ట్రెండ్ కొనసాగుతుందని కరణ్ అదానీ పేర్కొన్నారు. వ్యాపారం వృద్ధి చెందుతోందని తాము కేవలం క్యాచ్ అప్ గేమ్ కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీలంక ప్రాజెక్టును గమనిస్తే.. అదానీ పోర్ట్స్, జాన్ కీల్స్ హోల్డింగ్స్, శ్రీలంకో పోర్ట్ అథారిటీలతో కూడిన ఒక కన్సార్టియం 2021లో పోర్ట్స్ టెర్మినల్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని మెుత్తం విలువ 700 మిలియన్ డాలర్లుగా ఉంది.


Click it and Unblock the Notifications