ఒకవైపు బెల్గాంలో మరాఠీ ఇంకా కన్నడ మాట్లాడే వర్గాల మధ్య ఉద్రిక్తత ఉంటే, మరోవైపు బెంగళూరులో ఇతర భాషలు మాట్లాడే వారి సంఖ్య నిరంతరం పెరుగుతోంది. తాజగా బెంగళూరులో ఒక ఆటో డ్రైవర్ని "హిందీలో మాట్లాడాలి" అని డిమాండ్ చేస్తున్న వీడియో వైరల్ కావడంతో అతని పై ఆన్‌లైన్‌లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. దింతో చివరికి తనకు జీవనోపాధి కల్పించిన నగరం పట్ల తనకు గౌరవం ఉందని తెలియజేస్తూ కన్నడలో క్షమాపణలు చెప్తూ వీడియో షేర్ చేసాడు.

ఈ వైరల్ వీడియోలో ఓ వ్యక్తికి, ఆటో డ్రైవర్ కు మధ్య జరిగిన ఉద్రిక్త సంభాషణ కనిపిస్తుంది. ఈ ఫుటేజ్ లో ఆ వ్యక్తి కోపంగా, "నువ్వు బెంగళూరులో ఉండాలనుకుంటే హిందీలో మాట్లాడు" అని పట్టుబడుతుంటాడు, పక్కన అతని స్నేహితులు పరిస్థితిని చక్కబెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. ఆటో డ్రైవర్ నిరాశతో "నువ్వు బెంగళూరుకు వచ్చావు; నువ్వే కన్నడలో మాట్లాడాలి, నేను హిందీలో మాట్లాడను" అని అంటాడు. చాలా మంది సోషల్ మీడియా యూజర్లు ముఖ్యంగా కన్నడిగులు ఆ వ్యక్తి అన్న మాటలకు స్థానిక సంస్కృతి పట్ల అగౌరవంగా వ్యవహరించాడని ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఈ విమర్శల నేపథ్యంలో ఆ వ్యక్తి కన్నడలో క్షమాపణలు చెబుతూ ఒక వీడియోను విడుదల చేశాడు. "నేను కన్నడిగులందరికీ క్షమాపణలు కోరుతున్నాను. నేను తొమ్మిది సంవత్సరాలుగా బెంగళూరులో నివసిస్తున్నాను. ఈ నగరం పట్ల బలమైన సంబంధం ఉన్నాను. బెంగళూరు నాకు ఒక జీవితాన్ని ఇచ్చింది, నేను దానిని గౌరవిస్తాను. నేను ఇక్కడే జీవనోపాధి పొందుతున్నాను, ఈ నగరాన్ని నిజంగా అభినందిస్తున్నాను. నేను ఎవరైనా మనోభావాలను గాయపరిచి ఉంటే, నన్ను క్షమించండి" అంటూ వీడియో పోస్ట్ చేసాడు.
ఈ సంఘటన బెంగుళూరులో ఎక్కడ జరిగింది అనేది అస్పష్టంగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో రకరకాల స్పందనలు వచ్చాయి. కొంతమంది ప్రశాంతంగా అన్నిటిని అర్థం చేసుకోవాలని ప్రోత్సహించగా, మరికొందరు విమర్శలు కురిపించారు. ఒక వినియోగదారు "ఇప్పుడు అతని తప్పు అతను తెలుసుకున్నాడు వదిలేయండి" అని అనగా మరొకరు ప్రతి ఒక్కరూ ఒక ప్రదేశాన్ని సందర్శించినప్పుడు లేదా అక్కడ ఉంటున్నప్పుడు ప్రాంతీయ భాషలు, సంస్కృతిని గౌరవించాలని" అని అన్నారు. అలాగే మరొక యూజర్ తప్పులు చేయడం, క్షమాపణ చెప్పడం సరైనదే. ద్వేషానికి ద్వేషంతో సమాధానం ఇవ్వడం పరిష్కారం కాదు. కన్నడిగ ప్రజలు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేయవద్దని కోరుతున్నాను అని పేర్కొన్నాడు. అయితే గతంలో కూడా బెంగళూరులోని అర్బన్ కంపెనీ కన్నడ భాషను విస్మరిస్తోందని ఆరోపణలు వచ్చాయి. ఒక కస్టమర్ కన్నడ మాట్లాడటం వల్లే తన సర్వీస్ రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications