ఉద్యోగం వదిలేసి వ్యాపారాలు, స్టార్ట్ అప్స్ మొదలు పెట్టడం చూసాం... కానీ వ్యవసాయం, పంటసాగు ద్వారా ఒక కొత్త బ్రాండ్ ఉత్పత్తులను తయారు చేయడం చూసారా.. డాక్టర్ కామిని సింగ్ తన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలివేసి, ఇప్పుడు డాక్టర్ మోరింగ బ్రాండ్ కింద ఆర్గానిక్ మోరింగ పౌడర్, సబ్బులు, నూనె ఇంకా ఇతర ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆమె టర్నోవర్ రూ.2.5 కోట్లకు చేరుకుంటుంది. అంటే మీరు అంచనా వేయొచ్చు ఈ స్టార్ట్ అప్ ఆలోచన ఎంత లాభదాయమైందో. ఇప్పుడు యుపిలో మోరింగ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కామిని 1050 మంది రైతులతో కూడా కలిసి పనిచేస్తుంది.
అయితే డాక్టర్ కామిని సింగ్ అనే మహిళా లక్నోలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సబ్ ట్రాపికల్ హార్టికల్చర్ (CISH) లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నప్పుడు ఆమె పంటలు ఇంకా వ్యవసాయం పై ఫీల్డ్ లెవెల్ ప్రదర్శనలు ఇచ్చేది. ఏడు సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత, ఇంట్లో మునగపై పరిశోధన చేయడానికి 2015లో ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఆ సమయంలో కంపెనీ ఆమెకి ప్రాజెక్ట్ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చింది, అలాగే కంపెనీ కలిసి పనిచేయడం ప్రారంభించింది. రైతు-ఉత్పత్తి సంస్థ (FPC) రైతులకు డబ్బు ఆదా చేయడంలో సహాయపడింది. కామిని లక్ష్యం స్థానిక రైతులతో పరిచయం పెంచింది. అప్పుడే పరిశోధన నుండి ప్రయోజనం పొందేలా వారితో కలిసి పనిచేయాలని నిర్ణయించుకుంది.

పైలట్ ప్రాజెక్టు నుండి వ్యాపారం
2017లో ఆమె రైతులతో కలిసి మునగ సాగు కోసం ఒక పైలట్ వర్క్ కూడా కామిని చేసింది. మునగ ఒలిఫెరాను ఒక అద్భుత చెట్టు అని పిలుస్తారు ఎందుకంటే దాని ఆకులు, వేర్లు ఇంకా పండ్లు (మునగకాయ) విటమిన్లు, ఖనిజాలు ఇతర ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. మునగ సారం యాంటీఆక్సిడెంట్, క్యాన్సర్ నిరోధక, మధుమేహ నిరోధక, యాంటీమైక్రోబయల్గా ఉపయోగించబడుతుంది. మోరింగ సాగుకు రసాయనాలు అవసరం లేదు. అధిక పెట్టుబడులు లేకుండా ప్రతి వాతావరణంలో సులభంగా పెరుగుతుంది.
ఆ సమయంలో రైతులు మునగ సాగుతో ఎకరానికి రూ. 30,000 నుండి రూ. 35,000 వరకు ఆదాయం పొందేవారు. పొలం సరిహద్దులో మాత్రమే మునగను పెంచడం ద్వారా వారి ఆదాయం రూ. 50,000కు కూడా పెరిగింది. మునగ ఎండిన ఆకులను కూడా కిలోకు రూ.55కు కొనుగోలు చేసేవాళ్ళు. కానీ నేడు రేటు కిలోకు రూ. 80 నుండి రూ. 90గా పలుకుతుందని చెప్పారు.
ఈ స్టార్ట్ అప్ సక్సెస్ తో ఉత్సాహంగా ఉన్న కామిని, రైతులతో కలిసి పనిచేయడానికి ఇంకా పౌడర్, సబ్బు, నూనె, క్యాప్సూల్స్ వంటి మునగ ఉత్పత్తులను తయారు చేయడానికి 2019లో FPC జైవిక్ వికాస్ కృషి సంస్థను స్థాపించింది. ఆమె ప్రారంభించినప్పుడు రైతులు ఆకులను కడిగిన తర్వాత ఆకు కట్టలను తీగలకు వేలాడదీసి వాటిని చేతితో ఆరబెట్టేవారు.
రైతులతో కలిసి పనిచేయడం
ఇప్పుడు రైతులు సేంద్రీయ మునగ సాగుకు మారడానికి సహాయపడుతుంది అలాగే FPC ఆకులను ఎండబెట్టే సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తుంది. ఎండిన ఆకులను FPC కొనుగోలు చేసి ఉత్పత్తులుగా మారుస్తుంది. రైతులకు కనీసం 50 ఎకరాల క్లస్టర్‌ను అభివృద్ధి చేయడంలో మేము సహాయం చేస్తాము. తరువాత రూ.5 లక్షల నుండి రూ.10 లక్షల వరకు ఖర్చయ్యే సౌరశక్తితో ఎండబెట్టే సౌకర్యాన్ని ఏర్పాటు చేయడంలో మేము వారికి సహాయం చేస్తాము అని కామిని తెలిపింది.
5 నుండి 10 ఎకరాలు సమిష్టిగా ఉన్న చిన్న రైతులు ఎగ్జాస్ట్ అండ్ బ్లో డ్రైయర్‌లను ఉపయోగించి మాన్యువల్ డ్రైయింగ్ సిస్టమ్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. దీని ధర రూ.50,000 నుండి రూ.80,000 వరకు ఉంటుంది. కేవలం 0.25 ఎకరాలు ఉన్న రైతు ప్రతి 45 నుండి 60 రోజులకు ఒకసారి పండించే మునగ ఆకుల నుండి కూడా మంచి ఆదాయం పొందవచ్చు. ప్రస్తుతం, FPC లక్నో ఇంకా చుట్టుపక్కల రైతులతో మాత్రమే పనిచేస్తుంది.
ప్రారంభంలో లాభం తక్కువగా ఉన్నప్పుడు ప్రాసెసింగ్ కోసం ఆకులను ఇతరులకు ట్రాన్స్పోర్ట్ చేయడం లాభదాయకం కాదు. కాబట్టి మేము మా ఇంట్లో ప్రాసెసింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నాము. నేను లోన్ తీసుకుని సిఫ్టర్, గ్రేడర్, పల్వరైజర్ వంటి కొన్ని ప్రాథమిక యంత్రాలను కొనుగోలు చేసాను, యంత్రాల కోసం రూ.7.5 లక్షలు పెట్టుబడి పెట్టాను అని చెప్పింది. అంతేకాకుండా, కామిని ఆమె భర్త కూడా ఏడు ఎకరాల భూమిని లీజుకు తీసుకొని మునగ సాగును ప్రారంభించారు. మీరు మునగతో ఏదైనా కూరగాయలు లేదా మూలికలను పంటగా వేయవచ్చు అని కూడా చెప్పింది.
మునగ ఉత్పత్తుల విస్తరణ
కామిని కేవలం మునగ పొడితో ప్రారంభించి సమీపంలోని మార్కెట్లలోని దానిని పౌచ్ ప్యాకింగ్‌లో అమ్మేవారు. ప్రజలు ట్రయల్ ప్రాతిపదికన కొనుగోలు చేసి మళ్ళీ కొనేందుకు వచ్చేవారు. ఆ సమయంలో ఆమె IIT (BHU)లోని RKVY-RAFTAAR అగ్రి-బిజినెస్ ఇంక్యుబేటర్ (R-ABI) గురించి విన్నది, ఇది యువ వ్యవసాయదారులకు మార్గదర్శకత్వం ఇంకా సపోర్ట్ చేస్తుంది .
నేను మొరింగ ప్రాజెక్టు కోసం దరఖాస్తు చేసాక మంజూరు అయ్యింది. అప్పుడు నాకు రూ.25 లక్షల గ్రాంట్ అందింది, దానిని నేను 2020 లో వ్యాపార విస్తరణకు ఉపయోగించాను. ఈ గ్రాంట్‌ను ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ మెషిన్, క్యాప్సూల్ ఫిల్లింగ్ మెషిన్ కొనడానికి పెట్టుబడి పెట్టి అలాగే మునగ పొడి నుండి టీ, సబ్బులు, క్యాప్సూల్స్, నూనె ఇతర ఉత్పత్తులకు మారింది. నేను బ్రాండింగ్ & మార్కెటింగ్‌లో కూడా పెట్టుబడి పెట్టాను. నేను కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR)కి ఒక ప్రాజెక్ట్‌ను సమర్పించాను. మహిళా శాస్త్రవేత్తగా మునగపై పరిశోధన చేయడానికి నాకు అనుమతి లభించింది. ఫలితంగా నా ఉత్పత్తులకు సర్టిఫికేట్ పొందగలిగాను. ప్రయోగశాలకు యాక్సెస్ ఇంకా స్టైఫండ్‌తో పాటు, రైతులకు ఉచితంగా పంపిణీ చేయడానికి విత్తనాలు, మొక్కలను కూడా లభించాయి. ఆ పరిశోధనతో మోరింగ కుకీలు, చాక్లెట్లు, సీరం, హెయిర్ ఆయిల్, పెయిన్ రిలీవర్ ఆయిల్ అనేక రకాల సబ్బులకు విస్తరించాము అని ఆమె చెప్పింది.
డాక్టర్ మోరింగ బ్రాండ్ కింద ప్రస్తుతం 22 ఉత్పత్తులు ఉన్నాయి. రిటైల్ అవుట్‌లెట్‌లతో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో ఇంకా సోషల్ మీడియాలో కూడా ఉత్పత్తులను విక్రయిస్తుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications