Kalyan Jewellers: వరల్డ్ వైడ్ విస్తరణ దిశగా కళ్యాణ్ జ్యూయలర్స్.. దీపావళి నాటికి అక్కడ మొదటి స్టోర్ ప్రారంభం
Gold News: జ్యూయలరీ మార్కెట్ గత కొంతకాలంగా కళకళలాడిపోతోంది. బంగారం ధరలు ఇంకా పెరిగిపోతాయనే భయంతో ఎక్కువగా కొనుగోళ్లు జరిగాయి. ప్రస్తుతం అందనంత ఎత్తుకు ఎదిగిన ధరలు సామాన్యుడికి ఏమాత్రం అందుబాటులో లేవు. కాగా ఈ ఆభరణాలను విక్రయించే సంస్థలు మాత్రం దేశాలు దాటి విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి.
ఆభరణాల తయారీ సంస్థ కళ్యాణ్ జ్యువెలర్స్ US మార్కెట్లోకి ప్రవేశించాలని నిర్ణయించుకుంది. దీపావళి నాటికి అక్కడ తన మొదటి షోరూమ్‌ను ప్రారంభించేందుకు ప్లాన్ రెడీ చేసింది. దీనితో పాటు భారత్‌లోనూ 40 కళ్యాణ్ షోరూమ్‌ల ఏర్పాటుకు సిద్ధమవుతోంది. వీటికి అదనంగా దాని అనుబంధ సంస్థ కాండరే ద్వారా కూడా మరో 30 షోరూమ్స్‌ను స్టార్ట్ చేయాలని చూస్తోంది.

తాజాగా విడుదలైన త్రైమాసిక ఫలితాల్లో కళ్యాణ్ జ్యూయలర్స్ సుమారు 27 శాతం ఆదాయ వృద్ధిని నివేదించింది. భారత్‌లో కార్యకలాపాలు 29 శాతం పెరగగా.. మిడిల్ ఈస్ట్‌లో 16 శాతం వద్ధి సాధించింది. ఇక గతేడాదితో పోలిస్తే కాండరే సుమారు 13 శాతం మేర ఆదాయాన్ని పెంచుకుంది. ఈ వ్యాపారంలో తన వాటాను పెంచుకునేందుకు ఎనోవేట్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (కాండరే)తో ఒప్పందంపై సంతకం చేసింది.
'కొత్త షోరూమ్ లాంచ్‌ల గురించి ఎంతో ఉత్సాహంగా ఉన్నాము. ప్రస్తుత త్రైమాసికం చివరిలో ఓనంతో ప్రారంభించి దేశవ్యాప్తంగా రాబోయే పండుగలు మరియు వివాహాల సీజన్ కోసం కొత్త కలెక్షన్స్‌తో సిద్ధమవుతున్నాము. ఈ ఆర్థిక సంవత్సరంలో 130కు పైగా కొత్త షోరూమ్‌లను ప్రారంభించాలని ప్లాన్ చేశాము' అని కళ్యాణ్ జ్యూయలర్స్ ఓ ప్రకటనలో తెలిపింది.


Click it and Unblock the Notifications