ముంబై: కళ్యాణ్ జ్యువెలర్స్. మెట్రో నగరాలు, ఓ మోస్తరు పట్టణవాసులకు చిరపరిచితమైన పేరు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో తన వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తోన్న ఈ బంగారు నగలు, ఆభరణాల విక్రయ సంస్థ.. ఇవ్వాళ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. నెట్ ప్రాఫిట్‌లో నష్టాలను చూపించింది.
ఈ ఏడాది మార్చి 31వ తేదీన ముగిసిన 2022-2023 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 3.11 శాతం మేర నష్టం వచ్చినట్లు వెల్లడించింది కల్యాణ్ జ్యువెలర్స్ సంస్థ యాజమాన్యం. నెట్ ప్రాఫిట్‌లో 697.99 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు తెలిపింది. 2021-2022 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంతో పోల్చుకుంటే భారీ నష్టాలను చవి చూసినట్టే. ఆ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసింలో 720.40 కోట్ల రూపాయల నెట్ ప్రాఫిట్‌ను అందుకుంది.

ఈ సారి 697.99 కోట్ల రూపాయల నష్టాన్ని నమోదు చేసింది. నాలుగో త్రైమాసికంలో కళ్యాణ్ జ్యువెలర్స్ మొత్తం 3,396.42 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి నమోదైన మొత్తం ఆదాయం 2,868.52 కోట్ల రూపాయలు. ఆదాయం అంచనాలకు అనుగుణంగానే ఉన్నప్పటికీ.. ఖర్చులు భారీగా పెరిగాయని, 3,268.47 కోట్ల రూపాయలను వ్యయం చేయాల్సి వచ్చిందని వివరించింది.
కంపెనీకి చెందిన రెండు ఎయిర్‌క్రాఫ్ట్స్‌ను విక్రయించినట్లు కళ్యాణ్ జ్యువెలర్స్ తెలిపింది. ఈ మేరకు స్టాక్ మార్కెట్స్‌కు ప్రతిపాదనలను సమర్పించింది. నాన్ కోర్ ఆస్తులను డిస్పోజ్ చేయడంలో భాగంగా ఈ రెండు ఎయిర్‌క్రాఫ్ట్స్‌ను విక్రయించినట్లు పేర్కొంది. 2022-2023 ఆర్థిక సంవత్సరం మొత్తంలో కళ్యాణ్ జ్యువెలర్స్ నిర్వహించిన వ్యాపార కార్యకలాపాల విలువ 14,109.33 కోట్ల రూపాయలకు పెరిగింది.

అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం 10,856.22 కోట్ల రూపాయలు. దీనివల్ల అందిన ఆదాయం 431.93 కోట్ల రూపాయలుగా చూపించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో నమోదు చేసిన ఆదాయం 224.03 కోట్ల రూపాయలు. షేర్ హోల్డర్లకు డివిడెండ్ అందజేయడానికి కల్యాణ్ జ్యువెలర్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంగీకరించారు. అయిదు శాతం అంటే ఒక్కో షేర్ మీద 50 పైసల మేర డివిడెండ్ ఇవ్వనున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కళ్యాణరామన్ తెలిపారు.


Click it and Unblock the Notifications