కళ్యాణ్ జువెల్లర్స్ ఇప్పుడు వ్యాపార విస్తరణను మరో దశకు తీసుకెళ్లే ప్రయత్నం లో ఉంది. తాజాగా కంపెనీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 170 షోరూమ్‌లను కొత్తగా ప్రారంభించాలనే వ్యూహంతో ముందుకెళ్తోంది. ఇందులో చాలా భాగం ఫ్రాంచైజ్ మోడల్ ద్వారానే ఉంటుంది. ఇది కంపెనీకి వ్యాపార పరంగా ప్రయోజనం ఇచ్చే విధంగా ఉండగా, మరోవైపు అప్పుల భారాన్ని తగ్గించడానికి కూడా ఇది ఉపకరిస్తుందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కళ్యాణ్ రామన్ తెలిపారు. 2025 జూన్ 30 నాటికి కంపెనీకి మొత్తం 406 షోరూములు ఉన్నాయి. అవి భారతదేశంలో - 287, మిడిల్ ఈస్ట్ - 36, అమెరికాలో - 2, లైఫ్‌స్టైల్ బ్రాండ్ కాందేరే (Candere) - 81.

ఈ ఆర్థిక సంవత్సరం (2025-26)లో కళ్యాణ్ జువెల్లర్స్ మొత్తం 170 కొత్త షోరూమ్‌లు ప్రారంభించాలని ప్లాన్ చేస్తోంది. అందులో 90 షోరూములు " కళ్యాణ్ " బ్రాండ్ కింద ఉంటాయి. ఈ 90లో 7 షోరూములు విదేశాల్లో అంటే యూకే (UK), యుఎస్ (US), మరియు మిడిల్ ఈస్ట్ దేశాల్లో ప్రారంభించనున్నట్లు సంస్థ తెలిపింది. మిగతా 80 షోరూములు "Candere" అనే లైఫ్‌స్టైల్ జ్యువెలరీ బ్రాండ్ కింద భారతదేశంలోనే టైర్ I, II, III, IV నగరాల్లో ఏర్పాటు చేయబోతున్నారు. ఈ విస్తరణ ప్రధానంగా ఫ్రాంచైజ్ మోడల్ ద్వారా జరుగుతుంది అంటే కంపెనీకి నేరుగా పెట్టుబడి అవసరం లేకుండా విస్తరణ సాధ్యమవుతుంది.
ఇలా కంపెనీ గత ఏడాది రూ.400 కోట్లు అప్పును తగ్గించింది. ఈ ఏడాది అదనంగా రూ.300 కోట్ల అప్పును తగ్గించాలనే లక్ష్యంతో ఉంది. ముఖ్యంగా గోల్డ్ మెటల్ లోన్ (GML) రూపంలో ఉన్న అప్పు తగ్గించడమే ప్రధాన లక్ష్యం. అప్పు తగ్గిస్తే, బ్యాంకులకు ల్యాండ్ గారంటీ భూములు తిరిగి వస్తాయి. ఆ భూములను వ్యాపార అవసరాలకు తిరిగి వాడుకోవచ్చు. దీని వల్ల కంపెనీ ఆర్థిక స్థితి మెరుగవుతుంది.
ఫ్రాంచైజ్ మోడల్ వల్ల పెట్టుబడి అవసరం లేదు "ఎందుకంటే ఫ్రాంచైజ్ ద్వారా షోరూమ్‌లు ఓపెన్ చేస్తున్నాం. మేము నేరుగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. మా క్యాపెక్స్ ప్రధానంగా మెయింటెనెన్స్ మరియు స్టాక్ కోసమే ఉంటుంది. ఇది సుమారు రూ.350-400 కోట్లు," అని రమేష్ తెలిపారు.
విదేశీ విస్తరణ ఎలా ఉంటుంది?
కొత్తగా UKలో షోరూమ్ ప్రారంభించనుంది. ప్రధానంగా US, UK, మిడిల్ ఈస్ట్ మార్కెట్లపైనే దృష్టి పెడుతుంది. ఇతర దేశాలైన ఆస్ట్రేలియా, మలేసియా, సింగపూర్ నుంచి కూడా డిమాండ్ ఉంది. కానీ కంపెనీ విదేశీ విస్తరణ విషయంలో చాలా ఆలోచించి, పద్ధతిగా ముందుకు వెళ్లాలని భావిస్తోంది.
ఇప్పటివరకు కంపెనీ ఒక వెయ్యి మందికి పైగా కాంట్రాక్ట్ మాన్యు ఫాక్చరర్లు ఉన్నారు. త్వరలో త్రిసూర్ లో కాంట్రాక్టు మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే భూమిని సొంతం చేసుకున్నారు అని రమేష్ తెలిపారు. 2025-26 Q1లో కళ్యాణ్ జువెల్లర్స్ ఏకీకృత ఆదాయం రూ.5,557.63 కోట్లు. గత 8-9 క్వార్టర్లు సేమ్ స్టోర్ సేల్స్ డబుల్ డిజిట్ వృద్ధితో కొనసాగుతున్నాయి. కంపెనీకి ప్రస్తుతం సుమారు 8-9% మార్కెట్ షేర్ ఉంది. ప్రతి ఏడాది 1% పైగా మార్కెట్ వాటా పెరుగుతోంది.
కళ్యాణ్ జువెల్లర్స్ వ్యాపారంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టడానికి కీలకమైన చర్యలు తీసుకుంది. ఈ మార్గంలో వ్యాపారాన్ని పెంచుకుంటే ఆర్థికంగా మిగులు ఏర్పడేలా ప్లాన్ చేయడం వల్ల కంపెనీకి భవిష్యత్‌లో మరింత స్థిరత్వాన్ని ఇస్తుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications