IPO News: ఐపీవో లాభాల కేక.. ఏడాదిలో లక్షను రూ.5 లక్షలుగా మార్చేసింది!
Kaka Industries Share: దేశీయంగా ప్రస్తుతం ఐపీవోలు లాభాలతో ఇన్వెస్టర్లను ముంచేస్తున్నాయి. దీనికి తోడు దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్స్ దౌడుతీయటం డబుల్ ప్రాఫిట్ తెచ్చిపెడుతోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది గత ఏడాది ప్లాస్టిక్ ఉత్పత్తుల పరిశ్రమ నుంచి ఐపీవోగా మార్కెట్లోకి వచ్చిన కాకా ఇండస్ట్రీస్ గురించి. లిస్టింగ్ తర్వాత కంపెనీ షేర్లలో భారీ పెరుగుదల నమోదైంది. కాకా ఇండస్ట్రీస్ షేర్లు శుక్రవారం 20 శాతం అప్పర్ సర్క్యూట్ తాకి రూ.259.55 వద్దకు చేరాయి. దీంతో స్టాక్ తన 52 వారాల సరికొత్త రికార్టు గరిష్ఠాలను అందుకుంది. దీనికి ముందు గురువారం కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.216.30 రేటు వద్ద ముగిసింది.

కంపెనీ ఐపీవో ఏడాది క్రితం రూ.58 ధరకి మార్కెట్లోకి వచ్చింది. కాకా ఇండస్ట్రీస్ కంపెనీ ఐపీవో రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 10 జూలై 2023న తెరుచుకోగా జూలై 12న ముగిసింది. జూలై 19న లిస్టింగ్ సమయంలో కంపెనీ షేర్లు భారీ ప్రీమియంతో రూ.110.20 రేటు వద్ద జాబితా చేయబడ్డాయి. అదే రోజున స్టాక్ ఒక్కోటి రూ.115.71 స్థాయి వద్ద ముగిశాయి. అయితే ఇప్పుడు దాదాపు ఏడాది తర్వాత కాకా ఇండస్ట్రీస్ కంపెనీ షేర్లు ఇష్యూ ధర కంటే దాదాపు 300 శాతానికి పైగా పెరిగి రూ.259.55కి చేరుకున్నాయి.
ఎవరైనా ఇన్వెస్టర్ కంపెనీ షేర్లను ఐపీవో సమయంలో పొంది లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి దానిని ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే వారు రూ.5.09 లక్షలు పొంది ఉండేవారు. కేవలం లిస్ట్ అయిన ఏడాదిలో కంపెనీ షేర్లు ఇన్వెస్టర్లను ధనవంతులుగా మార్చేశాయి. లిస్టింగ్ సమయంలో ఇన్వెస్టర్లు కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు మక్కువ చూపటంతో 292.66 సార్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యింది.


Click it and Unblock the Notifications