IPO News: కేక పుట్టిస్తున్న కాకా ఐపీవో.. అడుగుపెట్టగానే ఇన్వెస్టర్ల డబ్బు డబుల్..
Kaka Industries IPO: దేశంలో ఇటీవల ఎస్ఎమ్ఈ కేటగిరీలో మార్కెట్లోకి అనేక ఐపీవోలు అడుగుపెడుతున్నాయి. ఈరోజు మార్కెట్లోకి అడుగు పెట్టిన కంపెనీ సంచలన రాబడులను అందించింది.
ఈరోజు లిస్ట్ అయిన కాకా ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు స్టాక్ మార్కెట్‌లో దూసుకుపోతోంది. కంపెనీ షేర్లు దాదాపు 100% ప్రీమియంతో BSEలో రూ.115.71 వద్ద లిస్ట్ అయ్యాయి. లిస్టింగ్‌తో కాకా ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్టాక్ 5% ఎగువ సర్క్యూట్‌లో చిక్కుకుంది. కంపెనీ షేర్ ఐపీవో ఇష్యూ ధర కంటే రూ.57.71 ఎక్కువకు లిస్టింగ్ జరిగింది. కంపెనీ ప్రైస్ బ్యాండ్ పరిశీలిస్తే రూ.55-58గా కంపెనీ నిర్ణయించింది.

కాకా ఇండస్ట్రీస్ IPO లాట్ పరిమాణం 2,000 షేర్లుగా ఉంది. ఐపీవో మొదటి రోజు జూలై 10న కాకా ఇండస్ట్రీస్ 19.23 సార్లు సబ్‌స్క్రయిబ్ చేయబడింది. జూలై 11న ఇష్యూ ముగిసింది. జూలై 17న షేర్ల కేటాయింపు జరిగింది. బిగ్‌షేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ IPOకి రిజిస్ట్రార్‌గా ఉంది. హేమ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ లీడ్ మేనేజర్‌గా ఉంది.
కాకా ఇండస్ట్రీస్ ప్రాథమికంగా తలుపులు, కిటికీలు, ఫాల్స్ సీలింగ్‌లు, వాల్ ప్యానలింగ్, కిచెన్ క్యాబినెట్స్ తో పాటు ఇతర ఇంటీరియర్ వర్క్‌లలో ఉపయోగించే పాలిమర్ ఆధారిత ప్రొఫైల్‌లను తయారీ వ్యాపారంలో ఉంది. దీని ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో PVC ప్రొఫైల్‌లు, UPVC డోర్స్ అండ్ విండో ప్రొఫైల్‌లు, WPC ప్రొఫైల్‌లు.. సహా 1200 కంటే ఎక్కువ SKUలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications