Multibagger Stock: కొన్ని స్టాక్స్ ఇన్వెస్టర్ల పోర్ట్ ఫోలియోలో మ్యాజిక్ చేస్తుంటాయి. పైసల్లో పెట్టుబడి పెట్టిచ్చి వాటిని లక్షలు, కోట్లుగా మార్చేస్తుంటాయి. నిజానికి ఇలాంటివి వినటానికి కొంత ఆశ్చర్యంగా అనిపించినా అవి వాస్తవం. ఇలాంటి స్టాక్స్ ట్రెండ్ ఫాలోఅవ్వవు ట్రెండ్ సెట్ చేస్తుంటాయి. అవును, గ్లోబల్ మార్కెట్ సంకేతాల మధ్య భారత స్టాక్ మార్కెట్ విపరీతమైన ఒడిదుడుకులకు గురవుతూ కరెక్షన్ జరగటం మనందరం గమనించాం. కానీ ఈ స్టాక్ ఇన్వెస్టర్లను ఏడాది కాలంలోనే లక్షాధికారులను చేసేసింది. ఈ సమయంలో ఏకంగా 21,228% కంటే ఎక్కువ రాబడిని అందించింది.

పెన్నీ స్టాక్స్ బంపర్ రిటర్న్స్..
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న స్టాక్ ట్రెడ్ ఫాలోకాకుండా తన ప్రయాణాన్ని సాగిస్తోంది. ఆ స్టాక్ పేరేంటంటే కైజర్ కార్పొరేషన్ లిమిటెడ్. ఈ పెన్నీ స్టాక్ ఏడాదిలోనే మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది. ఇది ఈ సంవత్సరం మంచి రాబడులు అందించిన మల్టీబ్యాగర్లలో ఒకటిగా నిలిచింది. పెన్నీ స్టాక్స్ కు పవర్ ఎక్కువ అని చెప్పటానికి ఇదొక మంచి ఉదాహరణ.

షేర్ ప్రయాణం ఇలా..
కైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ షేరు ధర ఒక సంవత్సరం క్రితం BSEలో ఆగస్టు 16, 2021న 38 పైసలుగా ఉంది. ప్రస్తుతం జూలై 7, 2022న అంటే ఈ రోజు స్టాక్ 5 శాతం అప్పర్ సర్యూట్ లో లాక్ అయి రూ. 93.70 వద్ద ఉంది. అంటే కేవలం ఒక సంవత్సరంలో ఈ స్టాక్ విపరీతమైన రాబడిని అందించింది. ఈ కాలంలో ఇన్వెస్టర్లకు 21,228.95 శాతానికి పైగా అద్భుతమైన రాబడి వచ్చింది. 2022లో కైజర్ కార్పొరేషన్ స్టాక్ 2,675.68 శాతానికి పైగా పెరిగింది.

ఇన్వెస్టర్లకు లాభాల పంట..
కైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ షేరు ధరను పరిశీలిస్తే.. ఒక ఇన్వెస్టర్ ఈ షేర్‌లో ఏడాది క్రితం 38 పైసల చొప్పున రూ.లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే.. ఈ రోజు దాని విలువ రూ.2.46 కోట్లుగా ఉంది. అదే ఒక ఇన్వెస్టర్ ఈ ఏడాది షేరును రూ.2.92 చొప్పును లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఈ రోజు దాని విలువ రూ.3.20 లక్షలు అయి ఉండేది.

కంపెనీ వ్యాపారం..
కంపెనీ వ్యాపారం గురించి మాట్లాడుకున్నట్లయితే.. ఇది సెప్టెంబర్ 1993లో ముంబైలో స్థాపించబడింది. మార్చి 15, 1995న కైజర్ ప్రెస్ లిమిటెడ్ పేరుతో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్కెట్లోకి అడుగుపెట్టింది. దీని తర్వాత కంపెనీ పేరు నవంబర్ 05, 2013న 'కైజర్ కార్పొరేషన్ లిమిటెడ్'గా మార్చబడింది. ఈ కంపెనీ లేబుల్స్, స్టేషనరీ ఆర్టికల్స్, మ్యాగజైన్‌లు, కార్టన్‌లకు సంబంధించిన వ్యాపారంలో ఉంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications