Kabra Jewels IPO: దేశీయంగా ఎస్ఎమ్ఈ ఐపీవోల కోలాహలం కొనసాగుతోంది. వరుసగా లిస్ట్ అవుతున్న ఐపీవోలు పెట్టుబడిదారుల డబ్బును నిమిషాల్లో డబుల్ చేసిపడేస్తున్నాయి. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నప్పటికీ ఐపీవోలు మాత్రం మంచి రాబడిని అందించటంతో చాలా మంది తమ డబ్బును వీటిపై బెట్టింగ్ వేస్తున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది కబ్రా జ్యువెల్స్ కంపెనీ ఐపీవో గురించే. ఎస్ఎమ్ఈ కేటగిరీలో వచ్చిన ఐపీవో ఎన్ఎస్ఈలో 90 శాతం ప్రీమియం ధర రూ.243.20 వద్ద విజయవంతంగా ఎంట్రీ ఇచ్చింది. పేలుడు లిస్టింగ్ తర్వాత స్టాక్ కొనుగోలుకు ఎగబడటంతో ఇంట్రాడేలో షేర్లు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ని తాకింది. దీంతో ఇంట్రాడేలో కంపెనీ షేర్ల ధర ఒక్కోటి రూ.255.35 స్థాయికి చేరుకుంది. కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.10.87 కోట్లను సమీకరించిన సంగతి తెలిసిందే. ఐపీవోతో ప్రమోటర్ల వాటా కంపెనీలో 89.12% నుంచి ప్రస్తుతం 62.55%కి తగ్గించబడింది.

వాస్తవానికి కంపెనీ తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.40 కోట్లను సమీకరించే లక్ష్యంతో వచ్చిన సంగతి తెలిసిందే. ఇది పూర్తిగా తాజా ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచింది. ఐపీవో రిటైల్ పెట్టుబడిదారుల సబ్ స్క్రిప్షన్ కోసం జనవరి 15 నుంచి జనవరి 17 వరకు అందుబాటులో ఉంది. ఈ క్రమంలో కంపెనీ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.121.128గా నిర్ణయించింది. అలాగే లాట్ పరిమాణాన్ని 1000 షేర్లుగా నిర్ణయించటంతో పెట్టుబడిదారులు కనీసం రూ.1.28 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది.
ఐపీవో తన ఇష్యూ సమయంలో పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందనను అందుకుంది. ఆఫర్ ఓపెన్ చేసి ఉన్న సమయంలో పెట్టుబడిదారులు 3 రోజుల్లో 356 కంటే ఎక్కువ సార్లు సభ్యత్వాన్ని నమోదు చేశారు. రిటైల్ విభాగంలో 384.90 రెట్లు, నాన్ ఇన్టిట్యూషన్ ఇన్వెస్టర్ల కేటగిరీ 556.90 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్టిట్యూషన్ ఇన్వెస్టర్ల విభాగం 154.53 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది.
కంపెనీ వ్యాపారం..
కంపెనీ ప్రస్తుతం దేశంలోని రిటైల్ జ్యువెలరీ వ్యాపారంలో కొనసాగుతోంది. బంగారం, వెండి, వజ్రాభరణాల విక్రయం చేస్తున్న కంపెనీ 2010లో స్థాపించబడింది. వివాహం వంటి ప్రత్యేక అవసరాల కోసం ఆభరణాలను తయారు చేయటంలో ప్రసిద్ధి చెందింది. రోజువారీ ఉపయోగించే ఆభరణాల తయారీలో కూడా కంపెనీ అనేక డిజైన్లను ఆఫర్ చేస్తోంది. కంపెనీ దేశవ్యాప్తంగా 6 రిటైల్ స్టోర్లను కలిగి ఉండగా ఇవన్నీ గుజరాత్ అహ్మదాబాద్‌లోనే ఉన్నాయి.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications