Multibagger Stock: గత కొన్ని నెలలుగా కెమికల్ స్టాక్స్ తమ ఇన్వెస్టర్లకు ఊహించని రాబడులను అందిస్తున్నాయి. అలా మల్టీబ్యాగర్ రాబడులతో నమ్ముకున్న దీర్ఘకాలిక ఇన్వెస్టర్లను కోటీశ్వరులుగా చేశాయి.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది ఇన్వెస్టర్ల తలరాతను మార్చేసిన జ్యోతి రెసిన్లు & అడెసివ్స్ గురించే. ఈ కంపెనీ సింథటిక్ రెసిన్ అడెసివ్‌ల తయారీలో దేశంలో అగ్రగామిగా కొనసాగుతోంది. దీర్ఘకాలంలో ఈ కంపెనీ తన పెట్టుబడిదారులను కోటీశ్వరులుగా చేసింది. 2023లో ఇప్పటి వరకు స్టాక్ దాదాపు 13 శాతం రాబడిని అందించింది.

జ్యోతి రెసిన్లు & అడెసివ్స్ స్టాక్ ధర జూన్ 13, 2014న రూ.2.95గా ఉంది. అప్పటి నుంచి కంపెనీ షేర్ 47,620 శాతం మేర లాభపడింది. ఈరోజు మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో స్టాక్ ధర రూ.1,405 వద్ద కొనసాగుతోంది. ఎవరైనా ఇన్వెస్టర్ 9 ఏళ్ల కిందట రూ.లక్ష ఈ కంపెనీలో పెట్టుబడిగా పెట్టి ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే మార్కెట్ విలువ ప్రకారం దాని విలువ రూ.4.68 కోట్లకు చేరుకుని ఉండేది. అలాగే తక్కువ కాలం పాటు పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు సైతం మంచి రాబడులనే పొందారు.
జూన్ 21, 2022న స్టాక్ కనిష్ఠ స్థాయి రూ.699.63ని తాకింది. ఆ తర్వాత మూడు నెలల కాలంలో షేర్ ధర దాదాపు 160 శాతం పెరిగింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 15, 2022న రికార్డు స్థాయిలో రూ.1818.45కి చేరుకుంది. ర్యాలీ ఇక్కడితో నిలిచిపోవటంతో స్టాక్ ధర గరిష్ఠాల నుంచి దాదాపు 23 శాతం క్షీణించింది. అయితే ప్రస్తుతం కొత్త ఏడాది తిరిగి పుంజుకోవటం మెుదలెట్టింది.
సింథటిక్ రెసిన్ అడెసివ్‌లను తయారు చేసే జ్యోతి రెసిన్లు & అడెసివ్స్.. యూరో 7000 బ్రాండ్ పేరుతో ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఈ బ్రాండ్ 2006లో ప్రారంభించబడింది. రిటైల్ మార్కెట్లో కంపెనీ ఉత్పత్తులకు మంచి గుర్తింపు, డిమాండ్ ఉంది. ఈ వ్యాపారంలో కంపెనీ దేశంలోనే రెండవ అతిపెద్ద బ్రాండ్ గా కొనసాగుతోంది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.65.08 కోట్ల ఆదాయంతో పాటు రూ.16.41 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో నికల లాభం గత ఏడాదితో పోల్చితే 137 శాతం పెరిగింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications