స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఈ రోజుల్లో చాల మంది ఉన్నారు. ఇందుకు కారణం స్టాక్ మార్కెట్ పై పెరుగుతున్న అవగాహన ఇంకా పెట్టుబడులు ఇచ్చే మంచి లాభాలు. అయితే ఎక్కువ రిస్క్ లేకుండా లాభాలను పొందాలంటే పెన్నీ స్టాక్స్ బెస్ట్ అని చెప్పవచ్చు. ప్రస్తుత కాలంలో స్టాక్ మార్కెట్లో ఒడిదొడుకులు ఉన్నప్పటికీ పెన్నీ స్టాక్స్ మాత్రం అదరగొడుతున్నాయి. వీటిలో ఒకటి జ్యోతీ రెసిన్స్ స్టాక్.

గత 10 సంవత్సరాలలో చూస్తే ఈ షేర్ 30,016 శాతం పెరిగింది. 2015 ఏప్రిల్‌లో ఈ షేరు ధర రూ. 4.12 వద్ద ఉండగా, నేడు ఒక్కో షేరు ధర రూ. 1,240.80 వద్ద ట్రేడవుతుంది, అంటే 10 సంవత్సరాలలో 30,016 శాతం పెరుగుదల చూపిస్తుంది. ఉదాహరణకు ఒక పెట్టుబడిదారుడు ఈ స్టాక్ రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి కోంటే ఆ రూ. 1 లక్ష 10 సంవత్సరాలలో రూ. 3 కోట్లకు పెరిగేది, అంతేకాక గత 10 సంవత్సరాలకు 76.89 శాతం CAGR (కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్) రాబడికి దారితీసేది. ఇవాళ రూ. 1,490 కోట్ల మార్కెట్ క్యాప్‌తో ఉన్న జ్యోతి రెసిన్స్ షేర్ రూ. 1240.80 వద్ద ట్రేడవుతోంది. ఇంకా 1 ఏడాదిలో10 శాతం రాబడి ఇవ్వగా, 5 సంవత్సరాలలో ఈ స్టాక్ రాబడి 2,765 శాతంగా ఉంది.
కంపెనీ గురించి మాట్లాడితే జ్యోతి రెసిన్స్ అండ్ అడెసివ్స్ లిమిటెడ్ సింథటిక్ రెసిన్ అండ్ వుడ్ చెక్ పదార్థాలను అతికించడంలో ప్రత్యేకత ఉన్న ప్రముఖ భారతీయ తయారీ సంస్థ. దీనిని 1993లో స్థాపించగ, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో హెడ్ ఆఫీస్ ఉంది. ఈ కంపెనీ 2006లో ప్రవేశపెట్టిన పాపులర్ బ్రాండ్ EURO7000 క్రింద పనిచేస్తుంది. కంపెనీ హైలెట్స్ చూస్తే ఈ కంపెనీ 42 శాఖలతో 14 రాష్ట్రాల్లో కొనసాగుతుంది. ఇంకా 400 మంది సేల్స్ ఫోర్స్‌తో 60 మంది డిస్ట్రిబ్యూటర్లు, 12 వేల మంది రిటైలర్లు, 3,50,000 మంది కార్పెంటర్లు ఉన్నారు. ఈ బ్రాండ్ రిటైల్ విభాగంలో భారతదేశంలో అత్యధికంగా EURO XTRA, EURO WP 2IN1, EURO EXTREME 3, EURO ULTRA 5IN1, అండ్ EURO PVC GLUE వంటి ఉత్పత్తులను అందిస్తోంది.
డిమాండ్ బాగా పెరగడంతో ప్రస్తుత 2000 TPM సామర్థ్యం నుండి ఉత్పత్తి మరింతగా పెంచుతామని, శాఖలు అలాగే డిస్ట్రిబ్యూటర్ల పెరుగుదలతో కొత్త రాష్ట్రాలలోకి ప్రవేశిస్తామని కంపెనీ పేర్కొంది. కంపెనీ ఆదాయంలో 14.51 శాతం వార్షిక పెరుగుదలతో Q3FY24లో రూ. 62 కోట్ల నుండి Q3FY25లో రూ.71 కోట్లకు పెరిగినట్లు తెలిపింది. QoQ ప్రాతిపదికన కంపెనీ ఆదాయంలో 9.23 శాతం పెరుగుదలతో రూ. 65 కోట్లుగా నివేదించింది.
అలాగే నికర లాభం ఏడాదికి 18.75 శాతం పెరిగి రూ. 16 కోట్ల నుండి రూ. 19 కోట్లకు చేరుకుంది. QoQ ప్రాతిపదికన కంపెనీ నికర లాభం గత త్రైమాసికంలో రూ. 19 కోట్ల నుండి 18.75 శాతం పెరిగి రూ. 18.75 కోట్లకు చేరుకుంది. Q4 FY25 నాటికి కంపెనీలో అతిపెద్ద వాటాదారులైన ప్రమోటర్లు 50.83 శాతంతో, FIIలు 0.10 శాతంతో ఇంకా DIIలు 0.77 (విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు & దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు)తో ఉన్నారు, అయితే కంపెనీలో 48.30 శాతంతో పబ్లిక్ వాటాదారులు ఉన్నారు. దింతో కంపెనీలో మొత్తం వాటాదారులు 50,341.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

Investment: మార్కెట్ ఒడిదుడుకులకు భయపడుతున్నారా? ఈ టైంలో ధనవంతులు ఏం చేస్తారో తెలుసా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications