Multibagger Stock: మల్టీ బ్యాగర్ స్టాక్స్ అనేవి ఈ రోజుల్లో చాలా మంది పెట్టుబడి కోసం వెతుకుతున్న షేర్లు. స్టాక్ మార్కెట్లో వేలల్లో ఉండే అనేక స్టాక్స్ లో ఏది మంచి పనితీరు కనబరుస్తుందని కనిపెట్టడం అంత సులువు కాదు. కానీ.. కొంత రీసర్చ్ చేస్తే మంచి ఫండమెంటల్స్ ఉన్న గ్రోత్ ఓరియంటెడ్ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్స్ కనుగొనటం కష్టం కాదు. ఇవి పెట్టుబడి దారులకు తక్కువ కాలంలోనే మంచి రాబడులను ఇవ్వటమే కాకుండా వారిని లక్షాధికారులను, కోటీశ్వరులను చేస్తుంటాయి. అలాంటి కోవకు చెందినదే ఈ స్టాక్ కూడా.

దేశంలో రెండవ మార్కెట్ లీడర్:
మైక్రోక్యాప్ కంపెనీ జ్యోతి రెసిన్ అండ్ అడెసివ్స్ లిమిటెడ్ గత రెండేళ్ల కాలంలో తన ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది. ఈ సమయంలో ఈ స్టాక్ రూ.116.1 నుంచి రూ.2339.15కు చేరుకుంది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.915.96 కోట్లకు చేరుకుంది. ఈ కంపెనీ సింథటిక్ రెసిన్ అడెసివ్‌ల వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఇది EURO 7000 బ్రాండ్ పేరుతో వివిధ రకాల వైట్ గ్లూ(ఫర్నిచర్ తయారీలో ఉపయోగించే గమ్ము) తయారు చేస్తోంది. యూరో 7000.. 2006లో ప్రారంభించబడింది. ప్రస్తుతం ఈ కంపెనీ ఉత్పత్తులు దేశంలోని రిటైల్ విభాగంలో రెండవ అతిపెద్ద అమ్మకపు వుడ్ అడెసివ్స్ బ్రాండ్‌గా కొనసాగుతూ మంచి మార్కెట్ కలిగి ఉంది.

కార్పెంటర్ రివార్డ్ మోడల్:
వుడ్ అడెసివ్స్ రంగంలో దేశంలోనే అగ్రస్థానాన్ని సాధించి కార్పెంటర్ల ఉత్తమ ఎంపిక బ్రాండ్‌గా తీర్చిదిద్దాలని కంపెనీ భావిస్తోంది. ఇందుకోసం కంపెనీ ప్రత్యేకమైన కార్పెంటర్ రివార్డ్ మోడల్ సిస్టమ్‌ను రూపొందించింది. ఇది వడ్రంగుల కోసం లాయల్టీ ప్రోగ్రామ్. ప్రస్తుతం ఈ కార్యక్రమం కింద మూడు లక్షల మంది వడ్రంగులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. గత ఎనిమిది త్రైమాసికాలలో కంపెనీ పనితీరును పరిశీలిస్తే, దాని అమ్మకాలు ఏడు రెట్లు పెరిగాయి. ఈ కాలంలో కంపెనీ నికర లాభం ఆరు రెట్లు పెరిగింది. జూన్ 2020 త్రైమాసికంలో దీని EPS రూ. 2.80 ఉండగా.. మార్చి 2022 త్రైమాసికానికి అది రూ. 17.30కి చేరుకుంది.

ఖర్చు తగ్గింపుపై దృష్టి:
కంపెనీ దృష్టి ఖర్చులను తగ్గించుకోవడంపై పెట్టింది. కంపెనీ మొత్తం మ్యాన్‌పవర్ ఖర్చు దాని మొత్తం ఆదాయంలో 15-16 శాతంగా ఉంది. అమ్మకం, పంపిణీ ఖర్చులు 12 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. సంస్థ ఎసట్ టర్నోవర్ ఎనిమిది రెట్లు, టన్నుకు వారి Ebitda దాని రంగంలోని కంపెనీల్లో అత్యధికంగా ఉంది. ప్రస్తుతం కంపెనీ 48.41 రెట్లు TTM PE వద్ద ట్రేడవుతుండగా.. పరిశ్రమ PE Pidilite Industries Ltd కంటే 89.1 రెట్లు ఉంది. దేశంలోని వుడ్ అడెసివ్స్ రంగంలో Pidilite కంపెనీ మార్కెట్ లీడర్ గా కొనసాగుతోంది. ఈ కంపెనీ ఫెవిక్విక్, ఫెవికాల్ పేర్లతో అమ్ముతున్ను ఉత్పత్తులు ఇప్పటికే చాలా ప్రాచుర్యాన్ని పొందాయి.

స్టాక్ ధర ఈ రోజు ఎలా ఉందంటే..
FY 2022లో జ్యోతి రెజిన్స్ 43.21% ROE, 57.95% ROCEని కలిగి ఉంది. ఈ కాలంలో, పిడిలైట్ ROE 19.7%, ROCE 25.7%గా ఉన్నాయి. ఈ రోజు ఉదయం 9.30 గంటలకు, జ్యోతి రెసిన్లు & అడెసివ్స్ స్టాక్ 1.17 శాతం పెరిగి రూ.2366.50 వద్ద ట్రేడవుతోంది. బిఎస్ఈలో ఈ షేరు 52 వారాల కనిష్ఠ స్థాయి రూ.651 ఉండగా.. గరిష్ఠ ధర 2613.25గా ఉంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications