For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Penny Stock: లక్షను రూ.67 కోట్లుగా మార్చిన పెన్నీ స్టాక్.. ఇన్వెస్టర్లకు లాభాల సునామీ..

|

Multibagger Stock: చిన్నచిన్న పెట్టుబడులు పెద్ద లాభాలను అందిస్తాయనటానికి ఈ స్టాక్ మంచి ఉదాహరణ. అవును ఒకప్పుడు కేవలం పైసల్లో ఉన్న ఈ పెన్నీ స్టాక్ ధర ఇప్పుడు వేలల్లోకి చేరుకుంది. దీర్ఘకాలంలో తన ఇన్వెస్టర్లను కోటీశ్వరులుగా మార్చేసింది. ఎక్కువ రిస్క్ తీసుకునేవారికి ఎక్కువ రాబడి అందుతుంది అనే సామెత స్టాక్ మార్కెట్లలో చాలా ఫేమస్. ఆ మాట ఇప్పుడు మాట్లాడుకుంటున్న స్టాక్ కు ఖచ్చితంగా సరిపోతుంది.

వేలుగా మారిన పైసలు..

వేలుగా మారిన పైసలు..

పైన మనం చెప్పుకున్న ప్రతి మాటనూ అక్షరాలా నిజం చేసింది జ్యోతి రెసిన్స్ అండ్ అడ్హెసివ్ లిమిటెడ్ స్టాక్. ఒకప్పుడు కేవలం 36 పైసలుగా ఉన్న ఈ స్టాక్ ధర ప్రస్తుతం రూ.2,415 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.2,613.25 వద్ద ఉండగా.. ఈ షేరు 52 వారాల కనిష్ఠ ధర రూ.651గా ఉంది. ఈ కంపెనీ గ్రోత్ కు అనేక అవకాశాలను కలిగి ఉంది.

లక్షను కోట్లుగా మార్చిన వైనం..

లక్షను కోట్లుగా మార్చిన వైనం..

2004లో జ్యోతి రెసిన్ అండ్ అడెసివ్ లిమిటెడ్ షేర్ ధర కేవలం 36 పైసలు మాత్రమే. అయితే.. కంపెనీ షేరు ప్రస్తుతం రూ.2,415 వద్ద మార్కెట్లో ట్రేడవుతోంది. అప్పుడు స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులకు దాదాపుగా 6,60,000 రెట్ల కంటే ఎక్కువ రాబడిని అందించింది. ఈ లెక్కన ఒక వ్యక్తి ఈ స్టాక్ లో రూ. లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం వారి పెట్టుబడి విలువ దాదాపు రూ.67 కోట్లుగా ఉంది. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల ద్వారా పెట్టుబడిదారులు పెద్ద లాభాలు పొందడంలో సహనం ఎలా సహాయపడుతుందనేదానికి ఈ షేర్ సరైన ఉదాహరణ.

 కంపెనీ హిస్టరీ.. రుణ భారం తగ్గించుకుంటూ..

కంపెనీ హిస్టరీ.. రుణ భారం తగ్గించుకుంటూ..

1993లో స్థాపించబడిన జ్యోతి రెసిన్ అండ్ అడ్హెసివ్స్ లిమిటెడ్ సింథటిక్ రెసిన్ అడెసివ్‌ల తయారీ వ్యాపారంలో ఉంది. డిసెంబరు 2021తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం సంవత్సరానికి 51 శాతం పెరిగి 48.86 కోట్లకు చేరుకుంది. కంపెనీ ప్రస్తుతం EURO 7000 బ్రాండ్ పేరుతో తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. 2006లో ఈ బ్రాండ్ పేరు ప్రారంభించబడింది. ఫర్నిచర్ అతికించే అడెసివ్‌ల రిటైల్ వ్యాపారంలో ఈ కంపెనీ రెండవ అతిపెద్ద మార్కెట్ ను కలిగి ఉంది. గత కొన్ని సంవత్సరాల్లో కంపెనీ తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంది. మంచి లాభాల వృద్ధిని నమోదు చేస్తూ రుణ భారాన్ని తగ్గించుకుంది. స్టాక్ తన ఇన్వెస్టర్లకు అద్భుతమైన రాబడిని అందించడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణమని చెప్పుకోవాలి.

English summary

Penny Stock: లక్షను రూ.67 కోట్లుగా మార్చిన పెన్నీ స్టాక్.. ఇన్వెస్టర్లకు లాభాల సునామీ.. | Jyoti Resins And Adhesive Ltd stock gave multibagger returns to its investors by turning one lakh into 67 crores

This Adhesive stock gave multibagger returns to its investors
Story first published: Thursday, July 21, 2022, 15:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X