IPO News: మార్కెట్లోకి ప్రఖ్యాత కంపెనీ ఐపీవో.. ఇస్రో, బ్రహ్మోస్ ఏరోస్పేస్ దీని కస్టమర్స్..

IPO News: 2023 సంవత్సరం అత్యధికంగా ఇన్వెస్టర్లు తమ లాభాలను ఐపీవోల నుంచి పొందారని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది ప్రారంభం నుంచి మెల్లగా ఊపందుకున్న ఐపీవోల మార్కెట్లో అత్యధికంగా ఎస్ఎమ్ఈ కేటగిరీకి చెందిన కంపెనీలు ఉన్నాయి.

ఈ క్రమంలో తాజాగా జ్యోతి సీఎన్‌సీ ఆటోమేషన్ లిమిటెడ్ కంపెనీ తన ఐపీవో లాంచ్ కోసం సెబీ వద్ద డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌ని సమర్పించింది. జ్యోతి CNC ఆటోమేషన్ కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ (CNC) మెషీన్ల తయారీలో ప్రముఖ కంపెనీల్లో ఒకటిగా ఉంది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ మార్కెట్ల నుంచి రూ.1,000 కోట్ల మూలధనాన్ని సేకరించాలని నిర్ణయించింది. అయితే ఇందులో ఎలాంటి ఆఫర్ ఫర్ సేల్ ఉండబోదని వెల్లడించింది.

Jyothi CNC

అయితే ఆటోమేషన్ సంస్థ రూ.200 కోట్ల విలువైన ఈక్విటీ షేర్ల ప్రీ-ఐపీవో ప్లేస్‌మెంట్‌ను పరిగణించవచ్చని అంచనా. అటువంటి ప్లేస్‌మెంట్ చేపడితే, తాజా ఇష్యూ పరిమాణం తగ్గుతుంది. కంపెనీ అందించిన వివరాల ప్రకారం ఇష్యూ ద్వారా వచ్చే ఆదాయం రుణాల చెల్లింపులు, లాంగ్ టర్మ్ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుందని కంపెనీ ప్రకటించింది. జ్యోతి CNC ఆటోమేషన్ హురాన్ స్థాపించబడిన డీలర్ నెట్‌వర్క్ ద్వారా రోమానియా, ఫ్రాన్స్, పోలాండ్, బెల్జియం, ఇటలీ, యునైటెడ్ కింగ్‌డమ్‌లలో తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది.

Jyothi CNC

కంపెనీ కస్టమర్లలో ఇస్రో, బ్రహ్మోస్ ఏరోస్పేస్ తిరువనంతపురం లిమిటెడ్, టర్కిష్ ఏరోస్పేస్, యూనిపార్ట్స్ ఇండియా లిమిటెడ్, టాటా అడ్వాన్సెస్ సిస్టమ్ లిమిటెడ్, టాటా సికోర్స్కీ ఏరోస్పేస్ లిమిటెడ్, భారత్ ఫోర్జ్ లిమిటెడ్, కళ్యాణి టెక్నోఫోర్జ్ లిమిటెడ్, రోలెక్స్ రింగ్స్ లిమిటెడ్, బోష్ లిమిటెడ్ ఉన్నాయి. జూన్ 30, 2023 నాటికి జ్యోతి CNC ఆటోమేషన్ రూ.3,143 కోట్ల విలువైన ఆర్డర్ బుక్‌ను కలిగి ఉంది. 2013లో కంపెనీ ఐపీవో ద్వారా నిధులను సేకరించేందుకు SEBIకి డ్రాఫ్ట్ పేపర్‌లను దాఖలు చేసింది. అయితే ఆ తర్వాత తన ప్రణాళికను రద్దు చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+