రూ.1000కే మీకు రూ. 20 లక్షల ఇన్సూరెన్స్..; SBI గొప్ప ఇన్సూరెన్స్ ప్లాన్..

మన అవసరాలకు అనుగుణంగా ప్రస్తుతం ఎన్నో రకాల ఇన్సురెన్సులు ఉన్నాయి. అయితే ఇన్సూరెన్స్ ప్రతిఒక్కరి జీవితంలో ఎదో ఒక సమయంలో ఎంతో ఉపయోగపడే ఒక అభయ హస్తం లాంటిది. మనం జీవితంలో ఎన్నో సాధించాలని కళలుకంటుంటాం కానీ ఒకోసారి అనుకోని సంఘటలు, ప్రమాదాలు ఎదురైతే.. ఇలాంటి పరిస్థితులు మీ జీవితాలనే కాకూండా మీ కుటుంబంని కూడా తీవ్ర ప్రభావం చేయవచ్చు. ఒకోసారి ఆర్ధిక నష్టాల్లోకి నెట్టేస్తాయి. ఇలాంటప్పుడే ఇన్సూరెన్స్ మీకు ఉపయోగపడటంలో ముందుంటుంది. దేశంలోని ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలో ఒకటైన ఎస్బిఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ పర్సనల్ ఆక్సిడెంట్ పాలసీని అందిస్తుంది. ఈ SBI ఇన్సూరెన్స్ పాలసీ సంవత్సరానికి రూ. 100 నుండి ప్రారంభమయ్యే ప్రీమియంని తీసుకొచ్చింది.

అయితే ఇన్సూరెన్స్ చేసిన మొత్తం ఆధారంగా కవరేజ్ అప్షన్ ఉంటాయి. అంటే కస్టమర్లు వారికి సరిపోయే నాలుగు కవరేజ్ మొత్తాల నుండి ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. 2 లక్షల కవరేజ్ కోసం మీరు సంవత్సరానికి రూ.100 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అలాగే మీరు రూ.4 లక్షల కవరేజీని తీసుకుంటే మీరు ఏడాదికి రూ.200 అలాగే రూ.10 లక్షలకు రూ.500 కట్టాలి. 20 లక్షల కవరేజీకి మీరు సంవత్సరానికి రూ. 1,000 మాత్రమే కడితే సరిపోతుంది. పాలసీదారులు వారి అవసరాలు ఇంకా భద్రతకి తగిన ప్లాన్‌ను సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది.

https telugu goodreturns in market-update sensex-nifty-rise-after-many-days-smiles-are-seen-on-the-faces-of-investors-are-the-bad-times-ove-039755 html

SBI జనరల్ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ పాలసీ ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటి ఏంటంటే ప్రమాదవశాత్తు పాలసీదారుని మరణం సంభవిస్తే ఒకేసారి ఇన్సూరెన్స్ మొత్తం అందిస్తుంది. దీని వల్ల పాలసీదారుడి కుటుంబానికి క్లిష్ట సమయాల్లో ఆర్థిక సహాయం అందేలా చేస్తుంది. అయితే, ఈ పాలసీ ప్రత్యేకంగా ప్రమాదం కారణంగా మరణిస్తేనే కవర్ చేస్తుంది. ప్రమాదాల కారణంగా గాయాలు లేదా ఆసుపత్రి ఖర్చులకు ఎటువంటి కవరేజ్ ఉండదని గమనించాలి.

18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న భారతీయులు ఎవరైనా SBI లేదా దాని అనుబంధ బ్యాంకులలో సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్ ఉన్న వారు ఈ పాలసీని తీసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న కస్టమర్లు ఎలాంటి పేపర్ వర్క్ లేదా విధానాలు లేకుండా పాలసీ రిజిస్టర్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు లేదా రిజిస్టర్ కోసం మీ సమీప SBI బ్రాంచుల్లో సంప్రదించవచ్చు. పాలసీ తీసుకోవడం పూర్తయిన తర్వాత కవరేజ్ వివరాలను తెలుపుతూ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ జారీ చేస్తారు.

పాలసీని కొనుగోలు చేసే ముందు సేల్స్ బ్రోచర్‌లో పేర్కొన్న నిబంధనలు, షరతులను చదవాలని SBI జనరల్ కస్టమర్లకు సలహా ఇస్తుంది. తక్కువ ప్రీమియంలు, అధిక కవరేజ్ ప్రయోజనాలు ఇంకా సింపులు అప్లికేషన్ ప్రక్రియతో SBI ప్రమాద మరణ బీమా పాలసీ ఊహించని ప్రమాదాల నుండి ఆర్థిక రక్షణ కోరుకునే వ్యక్తులకు సరైన అప్షన్ అవుతుంది. నమ్మకమైన భద్రతా అందించడం ద్వారా ఈ పాలసీ ఆర్ధిక సంక్షోభ సమయాల్లో కూడా కుటుంబాలు ఆర్థికంగా సురక్షితంగా ఉండేలా చూస్తుంది. మీరు ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు సంబంధిత పాలసీ గురించి వివరంగా అడిగి తెలుసుకోండి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+