వైద్య రంగం నుంచి విద్యావిధానాల వరకు, ఆఫీస్ పనుల నుంచి రిక్రూట్మెంట్ వరకూ... ఏ రంగానికైనా ఇప్పుడు AI తన ప్రభావాన్ని చూపుతోంది. అలాంటి సమయంలో, ఒక్క AI బ్రౌజర్‌తోనే రెండు ముఖ్యమైన వైట్ కాలర్ ఉద్యోగాలను పూర్తిగా ఆటోమేటిక్ చేయవచ్చని Perplexity సంస్థ CEO అరవింద్ శ్రీనివాస్ చేసిన ప్రకటన, ఉద్యోగ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది.

కార్యాలయాల్లో అనేక రకాల ఉద్యోగాలు ఉంటాయి. వాటిలో రిక్రూటర్ (Recruiter), అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ (Administrative Assistant) వంటి వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రతి సంస్థకు ఎంతో కీలకం. కానీ, ఇప్పుడు ఈ రెండు ఉద్యోగాలను ఒక్క AI టూల్‌తో పూర్తిగా ఆటోమేట్ చేయవచ్చని Perplexity సంస్థ CEO అరవింద్ శ్రీనివాస్ వెల్లడించారు.
పెర్‌ప్లెక్సిటీ సంస్థ రూపొందించిన ఈ కొత్త AI బ్రౌజర్ పేరు Comet. ప్రస్తుతం ఇది invite-only బేటా వెర్షన్గా ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇది సాధారణ బ్రౌజర్ కంటే పూర్తిగా కొత్తదనం కలిగినది ఎందుకంటే ఇది మానవ మద్దతు అవసరం లేకుండా కొన్ని ముఖ్యమైన కార్యాలయ పనులను పూర్తిగా స్వతంత్రంగా చేయగలదు.
1. రిక్రూటర్ ఉద్యోగం
Comet బ్రౌజర్ ఒక రిక్రూటర్ వారం రోజులు చేసే పనిని ఒక్క ప్రాంప్ట్‌తో పూర్తి చేసే సామర్థ్యం కలిగిఉంది. ఉదాహరణకు, మీరు స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందినవాళ్లు మరియు Anthropic అనే కంపెనీలో పనిచేసిన అభ్యర్థులను ఉద్యోగానికి తీసుకోవాలనుకుంటే, Comet వారి ప్రొఫైల్స్‌ను లింక్డ్ఇన్ లాంటి వేదికలపై గుర్తిస్తుంది. తరువాత వారి కాంటాక్ట్ వివరాలను తీసుకుని, గూగుల్ షీట్లులో అవి అమర్చుతుంది. అంతేకాకుండా, వారికి వ్యక్తిగతీకరించిన మెయిల్స్ పంపించి, ఎవరెవరు స్పందించారో ఫాలోఅప్ చేస్తుంది. అలాగే గూగుల్ క్యాలెండర తో సమన్వయం చేసి ఇంటర్వ్యూలు షెడ్యూల్ చేస్తుంది. ఈ ప్రక్రియ అంతా కేవలం మీరు ఇచ్చిన ఒక్క ప్రాంప్ట్‌తో ఆటోమేటిక్‌గా జరుగుతుంది.
2. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్
Comet బ్రౌజర్ ఒక కార్యాలయంలోని సహాయకుడి (executive assistant) పనిని కూడా అలానే చేయగలదు. ఇమెయిల్స్ చెక్ చేసి వాటికి సరైన సమాధానాలు ఇవ్వడం. క్యాలెండర్ సమన్వయం మీటింగ్‌లు షెడ్యూల్ చేయడం, టైమ్ క్లాష్‌లను సరిచేయడం. వివిధ అప్లికేషన్ల మధ్య సమన్వయం చేస్తూ డేటాను అప్‌డేట్ చేయడం. టాస్క్ స్టేటస్‌ను ట్రాక్ చేయడం. ఇది అన్ని పనులను మీకు సులభంగా అర్థమయ్యే భాషలో ఇచ్చిన ఒక ప్రాంప్ట్ ద్వారా మేనేజ్ చేయగలదు.
AI భవిష్యత్తుపై సీఈఓ అభిప్రాయం
"ఒక మంచి AI ప్రాంప్ట్ వల్ల మీరు బిజినెస్‌లో రూ.2000 విలువ వచ్చే పని చేయించుకుంటే, దానికి ఖర్చు పెట్టడానికి ప్రజలు వెనుకాడరు" అని అరవింద్ శ్రీనివాస్ చెప్పారు. అంటే మనం కేవలం AIతో ఆదేశాలు (prompts) ఇచ్చి, పెద్దపెద్ద పనులను తక్కువ సమయంలో పూర్తిచేయగలమన్న మాట.
అంతేకాదు, ఆయన చెప్పింది ఏంటంటే - ఇది కేవలం ఒక టూల్(సాధనం) మాత్రమే కాకుండా, భవిష్యత్తులో ఇది పూర్తిగా ఒక "AI ఆపరేటింగ్ సిస్టమ్"గా మారాలి అనుకుంటున్నారు. అంటే, మనం ఒకసారి ఆదేశం (ప్రాంప్ట్) ఇస్తే, మనకు ఏమి చెప్పకుండా ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో పనులు చేస్తూ ఉంటూ, అవసరమైనంతవరకూ మన పని పూర్తిచేస్తుంది.
Anthropic కంపెనీ CEO డారియో అమోడీ మాట్లాడుతూ, "మరో ఐదేళ్లలో అర్హత తక్కువగా ఉండే ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల్లో సగం పోతాయి" అన్నారు. Ford కంపెనీ CEO జిమ్ ఫార్లీ కూడా "ఉద్యోగుల్లో సగం వరకు AI కారణంగా నశించబోతున్నాయి" అని హెచ్చరించారు. కానీ మరోవైపు, Salesforce CEO మార్క్ బెనియాఫ్ అభిప్రాయం మాత్రం భిన్నంగా ఉంది "AI ఉద్యోగాన్ని తీసుకోదు, కానీ దాన్ని మెరుగుపరుస్తుంది" అని చెప్పారు. అలాగే Nvidia CEO జెన్సెన్ హువాంగ్ కూడా "AI టూల్‌లా పనిచేస్తుంది. ఇది మనిషి సామర్థ్యాన్ని పెంచుతుంది" అన్నారు. ఇక Perplexity CEO అరవింద్ శ్రీనివాస్ మాత్రం స్పష్టంగా హెచ్చరిస్తూ, "AIని ముందుగా నేర్చుకొని ఉపయోగించేవారికి భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు చాలా ఉంటాయి. కానీ ఎవరైనా దీన్ని పట్టించుకోకపోతే, ఉద్యోగంగా నిలబడటం కష్టమే" అని అన్నారు.
ఈ తరుణంలో ఉద్యోగాలు చేసేవాళ్లు, లేదా చదువుతున్న విద్యార్థులు ఒక విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. AI మన పనిని తీసిపోదు, కానీ AIని ఉపయోగించలేని వాళ్లను మాత్రం తప్పిస్తుందనేది వాస్తవం.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications