Omelette ₹800+18% GST: భోజన ప్రియులు ఎక్కువగా అలాగే రెగ్యులర్ గా తినే ఆహారాల్లో ఆమ్లెట్ కూడా ఒకటి. ప్రపంచంలోని చాలా దేశాలతో పోల్చితే ఇండియాలో గుడ్డు ధర కూడా సరసంగా ఉండటం దీనికి కారణం. బ్యాచిలర్ల నుంచి సాధారణ గృహిణి వరకు అందరూ మెనూలో రెగ్యులర్ ఆహారంలో ఆమ్లెట్ స్థానాన్ని కలిగి ఉంటుంది.
అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమ్లెట్ విషయంపై పెద్ద రచ్చ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఒక ఇన్వెస్టర్ సోషల్ మీడియా వేదికగా లగ్జరీ హోటల్లో ఒక ప్లెయిన్ ఆమ్లెట్ ధరపై ప్రశ్నల వర్షం కురిపించాడు. దీనికి సంబంధించిన తాజా బిల్లును పంచకుంటూ ఒక ప్లెయిన్ ఆమ్లెట్ ధర రూ.800 వసూలు చేశారని పైగా దీనిపై 18 శాతం జీఎస్టీ కూడా సదరు హోటల్ విధించిందని పేర్కొన్నారు. అసలు ఒక చిన్న ఆమ్లెట్ ధర ఎందుకు ఇంత ఉందో తనకు అర్థం కావటం లేదని మీలో ఎవరికైనా తెలుసా అంటూ సోషల్ మీడియా యూజర్లను అడిగాడు. ఒక ప్లెయిన్ ఆమ్లెట్ ధర కొద్దిగా అటూ ఇటుగా రూ.25 కంటే ఎక్కువగా ఉండబోదని పేర్కొన్నాడు.

అయితే లగ్జరీ హోటల్ తన వద్ద మెుత్తంగా ఒక్క ఆమ్లెట్ కోసం రూ.944 వసూలు చేయటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. సదరు హోటల్ ఒక్క ఆమ్లెట్ పై దాదాపు 96.87 శాతం మార్జిన్ ఒక్క ఆమ్లెట్ పైనే పెట్టుకుని విక్రయాలు చేసిందని పేర్కొన్నాడు. కిరణ్ రాజ్‌పుత్ అనే వ్యక్తి చేసిన పోస్ట్ కొద్ది సమయంలోనే సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయ్యింది. దీంతో ఫైన్ డైనింగ్ పేరుతో పెద్ద హోటళ్లు లూటీ చేస్తున్నాయా అనే చర్చకు ఇది దారితీసింది. అనుభవం, హోటల్ యాంబియన్స్ కోసం కస్టమర్లు డబ్బులు చెల్లిస్తున్నారని కొందరు దీనిపై వాదిస్తున్నారు. అయితే మరికొందరు ప్రీమియం హోటళ్లలో గణనీయమైన మార్కప్‌లను ఎత్తి చూపుతున్నారు.
దీనిపై ఒక యూజర్ కామెంట్ చేస్తూ రూ.25కి లభించే ఆమ్లెట్ మీరు దానిని ఫోటో తీసుకోవటానికి అనుకూలంగా లేని స్థలమై ఉంటుందన్నారు. దాని గురించి స్నేహితులకు పంచుకోవటం లేదా సోషల్ మీడియా ఖాతాలో పంచుకోవటానికి అందంగా ఉండని ప్లేస్ అయ్యి ఉండొచ్చని అన్నాడు. కొందరు చెల్లించటానికి అనుకూలంగా ఉన్నందునే ధరలు అంత ఉన్నాయని అన్నారు. ధర చెల్లించటం అనేది వారి వ్యక్తిగతమని పేర్కొన్నాడు.
దీనిపై మరో యూజర్ స్పందిస్తూ.. కొంతమంది ధరలను లగ్జరీ డైనింగ్ ఆకర్షణలో భాగంగా చూస్తుంటారు. ఇక్కడ మీరు ఆమ్లెట్ కోసం డబ్బు చెల్లించడం లేదు సార్.. ఆ అనుభవానికి డబ్బు చెల్లించి దానికి బదులుగా సోషల్ స్టేటస్ కొంటున్నారని పేర్కొన్నాడు. సదరు లగ్జరీ హోటల్లో మీరు కొంటోంది ఆమ్లెట్ కాదని సోషల్ స్టేటస్ అని గమనించాలని రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. దీనికి తోడు జీఎస్టీ కూడా అధికంగానే ఉండటాన్ని కొందరు తప్పుపడుతున్నారు. చాలా కాలంగా దేశంలోని లగ్జరీ హోటళ్లు అధిక ధరలకు ఆహారాన్ని అందించటం ప్రారంభించాయి, అయితే దానికి చెల్లించటానికి ఒప్పుకునే వారు మాత్రమే అక్కడికి వెళుతున్నందున ఇది పెద్దగా ఎవ్వరూ చర్చించని వివాదంగా మారిపోయింది.


Click it and Unblock the Notifications