ఆఫీసుల్లో లీవ్ అడగడం అంటే చాలామందికి ఇప్పటికీ ఓ పెద్ద ప్రక్రియ. కానీ కొత్త తరం అయిన Gen Zకి ఇది అలా కాదు. వాళ్లు ఏమనుకుంటారో అదే చెబుతారు. ఓపికగా, పొలిటికల్‌గా కాకుండా, సరళంగా ఇటీవలి ఒక ఇంటర్న్ లీవ్ మెయిల్ ఉదాహరణగా మారింది. "ఇప్పుడు వైబ్ రాకపోతోంది... కాస్త బ్రేక్ తీసుకుంటా" అని ఓ Gen Z ఇంటర్న్ తన మేనేజర్‌కి పంపిన మెయిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కేవలం ఓ ఫన్నీ మెయిల్ కాదు. ఇది కొత్త తరం ఉద్యోగుల మనస్తత్వాన్ని, వాళ్ల పని పట్ల ఆలోచనలను, మెంటల్ హెల్త్‌పై చూపించే అవగాహనను ప్రతిబింబిస్తోంది. ఇది ఒక జెన్ Z (Gen Z) ఇంటర్న్ వ్రాసిన సెలవు మెయిల్. ఈ మైలేంటంటే?
ఓ జెన్ Z ఇంటర్న్ తన సీనియర్‌కు ఈమెయిల్‌లో ఇలా మెయిల్‌లో రాశాడు. ఇదంతా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ అయ్యింది.
"ఇటీవల పనిపట్ల ఒత్తిడిగా ఫీలవుతున్నాను. ఎనర్జీ కాస్త తగ్గిపోయినట్టుంది. కాబట్టి ఇప్పుడు ఆ వర్క్ వైబ్ రావడం లేదు. జూలై 28 నుంచి 30 వరకు సెలవు తీసుకుంటున్నాను".
పక్కన తన ట్రిప్ బుకింగ్ స్లిప్ కూడా జతపరిచారు! ఇలా నేరుగా, 'అలానే సెలవు తీసుకుంటున్నా' అన్నట్లు చెప్పేయడమే జెన్Z స్టైల్ అంటున్నారు నెటిజన్లు.
ఈమెయిల్‌ను షేర్ చేసిన వ్యక్తి ఒక AI స్టార్టప్‌లో పని చేస్తున్నారు. అక్కడ మూడు జెన్Z ఇంటర్న్స్‌కి లీడ్‌గా ఉన్నారు. "నా 20 ఏళ్ల కెరీర్‌లో ఇలాంటి సెలవు అభ్యర్థన చూసింది ఇదే మొదటిసారి" అని ఆయన రెడ్డిట్ లో పంచుకున్నారు.
అయితే, ఆయన ఆశ్చర్యానికి గురైనా, "ఈ కొత్త తరహా వర్కర్స్ నిజాయితీగా ఉన్నారు. వాళ్ల ఆంతర్యాన్ని నేరుగా చెబుతున్నారు. ఇది కూడా ఒక మంచి లక్షణమే." అని పేర్కొన్నారు. చివరకు ఆ ఇంటర్న్ సెలవును ఆమోదించారు కూడా!
ఈ పోస్టు వెంటనే వైరల్ అయింది. కొంతమంది వినోదంగా తీసుకోగా, మరికొంతమంది జెన్Z ప్రాముఖ్యతపై అభినందనలు తెలిపారు.
"ఇది నిజంగా ఐకానిక్. మనమంతా వీరి నుంచి నేర్చుకోవాలి" అని ఓ యూజర్ కామెంట్ చేశాడు.
జెన్Z తరం వాళ్లు తన ఫీలింగ్స్‌ను తమకు ఏం కావాలో స్పష్టంగా చెబుతారు. ఇది రాబోయే ఉద్యోగ పరిసరాల్లో ఒక మంచి మార్పు." "నా భర్త రెండు నెలలుగా సెలవు తీసుకోలేదు. అతను కూడా ఈమెయిల్ చూసి నేర్చుకోవాలి అని స్పందిస్తున్నారు.
అయితే మరికొందరు ఇలా స్పందించారు "ఈ తరం ఎక్కువ ఆర్థిక సౌలభ్యంలో పెరిగింది. మిల్లెనియల్స్ కన్నా తక్కువ స్ట్రగుల్ చూశారు కాబట్టి ఇలాంటివి చెప్పు గలుగుతున్నారు."
జెన్Z స్టైల్ అంటే ఏమిటి?
జెన్Z (Gen Z) అంటే సుమారుగా 1997 తర్వాత జన్మించిన తరం వీరి ప్రత్యేకత ఇప్పుడు నేరుగా మాట్లాడటం, ఫీలింగ్స్‌ను దాచుకోకుండా చెప్పటం. ముఖ్యముగా మెంటల్ హెల్త్‌కు ప్రాధాన్యం ఇవ్వడం. ప్రొఫెషనల్ లైఫ్‌లో కూడా పర్సనల్ మూడ్‌కి విలువ ఇవ్వడం.
జెన్Z వర్క్ కల్చర్‌లో మారుతున్న దృక్పథం:
1. వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కు ప్రాధాన్యత: జెన్‌జెడ్ తరాలు ఉద్యోగానికంటే వ్యక్తిగత ఆరోగ్యం, మానసిక శాంతికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
2. ఫార్మాలిటీకి బదులుగా నిజాయితీ: వారిలో స్పష్టత ఉంటుంది. తాము ఎలా అనుభవిస్తున్నామో మేనేజ్‌మెంట్‌కు బహిరంగంగా చెబుతారు.
3. టెక్నాలజీపై ఆధారపడే తరం: మెయిల్స్, చాట్‌లు, కమ్యూనికేషన్ అన్నీ షార్ట్ మెసేజ్ తరహాలో ఉండటం వీరి శైలి.
ఈ రోజుల్లో ఉద్యోగస్తుల మెంటల్ హెల్త్ అంటే కేవలం ఓడిపోవడమే కాదు, అంతకంటే ఎక్కువగా అది భావోద్వేగాల్ని అర్థం చేసుకోవడం, విశ్రాంతికి విలువ ఇవ్వడం. "వైబ్ లేదనిపిస్తుంది" అనే మాటను కొంతమంది తేలికగా తీసుకున్నా, ఇది నిజానికి మనస్సులో ఉన్న ఒత్తిడిని చెప్పే సరళమైన మార్గం. ఇది బర్నౌట్ (burnout) లాంటి విషయాలను అంగీకరించగల నైజాన్ని ప్రతిబింబిస్తుంది.
కొత్త తరం ఉద్యోగులు ముఖ్యంగా Gen Z పని ఒత్తిడిలోనూ రెగ్యులర్‌గా చిన్న బ్రేక్‌లు అవసరం అనే విషయాన్ని బాగా అర్థం చేసుకుంటున్నారు. మెంటల్ హెల్త్ బ్రేక్‌లు తీసుకోవడం తప్పు కాదు, అవసరమే అనే దృష్టికోణాన్ని వారు తెచ్చారు. ఇది తమ ఆరోగ్యం పట్ల తీసుకునే జాగ్రత్త మాత్రమే కాదు, తమ పనితీరు మెరుగుపరచే ఒక ముఖ్యమైన చర్యగా కూడా చూస్తున్నారు.
ఇది నేటి ఉద్యోగ కల్చర్‌లో ఒక ఆరోగ్యకరమైన మార్పు. గతంలో "కష్టపడితేనే ఫలితం" అనే మాటకి బదులుగా "సమతుల్యంగా పని చేస్తేనే స్థిరమైన ఫలితం" అనే దిశగా ఆలోచనలు మారుతున్నాయి. ఇలాంటి కొత్త ఆలోచనలు సంస్థలకూ, వ్యక్తులకూ, రెండింటికీ ఉపయోగపడతాయి.
ఈ ఇంటర్న్ ఈమెయిల్ ఒక నవతరం మార్గదర్శకంగా మారింది. పనిపట్ల సీరియస్‌గా ఉన్నా, మన ఆరోగ్యం, భావోద్వేగాలపై కూడా కేర్ తీసుకోవడం అవసరమే. జెన్Zల దృక్పథం మనందరికీ ఓ తేలికైన గుర్తు చేసేవిధంగా ఉంది "ఆఫీస్ మూడ్‌లో లేను అనడం తప్పు కాదు!"
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications