ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు.. లైఫ్ టైం పెన్షన్ వస్తుంది.. ఈ స్కిం సూపర్..

ప్రతి ఒక్కరూ జీతం లేదా సంపాదన నుండి కొంత సేవింగ్స్ చేసి సురక్షితంగా ఉండే వాటిలో ఇన్వెస్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తుంటారు. ఎందుకంటే ఇలాంటి పెట్టుబడిపై మంచి వడ్డీ వస్తుంది కాబట్టి. ఇండియాలో అతిపెద్ద బీమా సంస్థ LIC అన్ని వయసుల వారికి ఒకటి కాదు, చాల రకాల గొప్ప పాలసీలను అందిస్తుంది. LIC రిటైర్మెంట్ స్కీమ్స్ బాగా పాపులర్ కూడా, రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని వీటిని ప్రవేశపెట్టారు. ఈ పాలసీలలో ఒకటి LIC న్యూ జీవన్ శాంతి ప్లాన్, ఇది ఒక సింగిల్ ప్రీమియం ప్లాన్ అండ్ మీరు ఒకసారి పెట్టుబడి పెడితే మీరు ప్రతి సంవత్సరం రూ. 1 లక్ష వరకు పెన్షన్ పొందవచ్చు.

just Invest money once only you will get 1 lakh pension for lifetime this LIC scheme is amazing

ఒక్కసారి పెట్టుబడి పెడితే జీవితాంతం పెన్షన్ : రిటైర్మెంట్ తర్వాత ఎటువంటి ఆర్థిక సమస్యలను ఎదురుకోకుండా ఉండేందుకు ముందుగానే పెట్టుబడి పెట్టాలని చూస్తుంటారు. మీరు కూడా ఈ ఆలోచనతో సేవింగ్స్ చేస్తుంటే, ఒక ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే, LIC న్యూ జీవన్ శాంతి పాలసీ మీకు ఉపయోగపడుతుంది. ఈ పాలసీలో ఒకేసారి పెట్టుబడి పెట్టడం ద్వారా రిటైర్మెంట్ తర్వాత మీకు ప్రతినేల తప్పకుండా పెన్షన్ వస్తుంది. అంటే అందులో ఒక్కసారి పెట్టుబడి పెట్టాక రిటైర్మెంట్ తర్వాత కూడా మీకు జీవితాంతం పెన్షన్ వస్తూనే ఉంటుంది.

LIC ఈ పాలసీని తీసుకోవడానికి వయస్సు 30 నుండి 79 సంవత్సరాలు ఉండాలి. ఈ పథకంలో రిస్క్ కవర్ లేనప్పటికీ దీనిలో లభించే ప్రయోజనాలు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ LIC ప్లాన్ తీసుకోవడానికి కంపెనీ రెండు అప్షన్స్ అందిస్తుంది. వీటిలో మొదటిది సింగిల్ లైఫ్ కోసం డిఫర్డ్ యాన్యుటీ అండ్ రెండవది జాయింట్ లైఫ్ కోసం డిఫర్డ్ యాన్యుటీ. అంటే మీరు కోరుకుంటే మీరు ఒకే ప్లాన్‌లో పెట్టుబడి పెట్టవచ్చు లేదా మీరు కోరుకుంటే మీరు రెండు కలిపి అప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు.

Take a Poll

1 లక్ష పెన్షన్ ఎలా పొందాలి : LIC న్యూ జీవన్ శాంతి పథకం అనేది ఒక యాన్యుటీ ప్లాన్, ఈ ప్లాన్ తీసుకున్నాక మీరు మీ పెన్షన్ పరిమితి నిర్ణయించుకోవచ్చు. దింతో రిటైర్మెంట్ తర్వాత మీ జీవితాంతం ఫిక్స్డ్ పెన్షన్‌ వస్తుంటుంది. ఇంకా అద్భుతమైన వడ్డీని ఇస్తుంది. ఈ ప్లాన్ ప్రకారం 55 ఏళ్ల వ్యక్తి ఈ ప్లాన్ తీసుకుంటే రూ. 11 లక్షలు డిపాజిట్ చేసి ఐదు సంవత్సరాలు ఉంచుకుంటే ఈ మొత్తం పెట్టుబడిపై, మీరు సంవత్సరానికి రూ. 1,01,880 కంటే ఎక్కువ పెన్షన్ పొందవచ్చు. ఆరు నెలల ప్రాతిపదికన వచ్చే పెన్షన్ మొత్తం రూ. 49,911, ఇక ప్రతినెల చూస్తే వచ్చే పెన్షన్ రూ. 8,149 అవుతుంది.

ఎప్పుడైనా పాలసీని సరెండర్ చేసే సౌకర్యం : ఇటీవలి కాలంలో LIC కొత్త జీవన్ శాంతి ప్లాన్ కోసం యాన్యుటీ రేట్లను కూడా పెంచిందని గమనించాలి. ఈ పథకంలో ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. ప్రత్యేకత ఏమిటంటే మీరు ఈ పథకాన్ని ఎప్పుడైనా సరెండర్ చేయవచ్చు, దీనిలో కనీసం రూ. 1.5 లక్షల పెట్టుబడి పెట్టవచ్చు, అయితే గరిష్ట పరిమితి లేదు. ఈ కాలంలో పాలసీదారుడు మరణిస్తే అతని అకౌంట్లో జమ చేసిన మొత్తాన్ని నామినీకి ఇస్తారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+