Q4 Results: ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు జస్ట్ డయల్ కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు. దీంతో స్టాక్ ఇంట్రాడేలో గరిష్ఠంగా 13 శాతం మేర పెరిగి 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరుకుంది.
నేడు జస్ట్ డయల్ షేరు 12.9 శాతం ర్యాలీ చేయటంతో స్టాక్ ధర 52 వారాల గరిష్ఠమైన రూ.1,010ను తాకింది. వాస్తవానికి కంపెనీ 2023-24 ఆర్థిక సంవత్సరానికి నాలుగో త్రైమాసికంలో ఆరోగ్యకరమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేయటంతో షేర్లలో కొనుగోళ్లో కోలాహలం కొనసాగింది. జస్ట్ డయల్ లిమిటెడ్ మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం రూ.115.74 కోట్లుగా ఉన్నట్లు ప్రకటించింది. ఇది ఏడాది ప్రాతిపదికన గత మార్చి కంటే 38.44 శాతం అధికం. అలాగే కంపెనీ క్యూ4లో మెుత్తంగా రూ.361.56 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు వెల్లడైంది.

ఇదే క్రమంలో మార్చి త్రైమాసికంలో కంపెనీ ఖర్చులు స్వల్పంగా పెరిగి రూ.214.12 కోట్లుగా నివేదించబడ్డాయి. ఇక కంపెనీ మెుత్తం ఆర్థిక సంవత్సర పనితీరును గమనిస్తే.. ఏకీకృత నికర లాభం భారీగా పెరిగి రూ.362.93 కోట్లకు చేరుకుంది. గత ఏడాదికి ఇది కేవలం రూ.163.72 కోట్లుగా ఉంది. అలాగే కంపెనీ ఆదాయం గత ఏడాదికి రూ.986.67 కోట్ల నుంచి రూ.1,348.37 కోట్లకు వృద్ధి చెందింది. ఇంకా కంపెనీ ప్రత్యేక సందర్శకుల మొత్తం ట్రాఫిక్ Q4FY24లో ఏడాది ప్రాతిపదికన 7.4 శాతం వృద్ధి చెందిందని వెల్లడించింది. కంపెనీ పనితీరు భారీ స్థాయిలో మెురుగుపడటం ఆదాయాలు పెరగటం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది.
కంపెనీ ఫైలింగ్స్ ప్రకారం మెుత్తం యాక్టివ్ లిస్టింగ్‌లు మార్చి 31, 2024 నాటికి 43.6 మిలియన్లుగా ఉన్నాయి. కంపెనీ షేర్లు గత నెలలో 26.31 శాతం ర్యాలీ నమోదు చేశాయి. గడచిన ఆరు నెలల్లో స్టాక్ 30 శాతానికి పైగా పెరిగింది. జస్ట్‌డయల్ వ్యాపారాన్ని పరిశీలిస్తే.. ఇది వినియోగదారులకు అవసరమైన సంప్రదింపు వివరాలు, చిరునామాలు, రేటింగ్‌లు, వ్యాపారాలు, రెస్టారెంట్‌లు, హోటళ్లు, వైద్యులు, మరిన్నింటికి సంబంధించిన వివరాలను పొందేందుకు సహాయపడే సెర్చ్ వేదిక. భవిష్యత్తు ఆదాయాలు, మార్జన్లతో రెండంకెల వృద్ధిపై కంపెనీ సీఎఫ్ఓ నమ్మకంగా ఉన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications