Jupiter Life Line IPO: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోల హవా నడుస్తున్న వేళ.. నేడు జూపిటర్ లైఫ్ లైన్ హాస్పిటల్స్ సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడుతోంది. దీంతో మార్కెట్లోని ఇన్వెస్టర్ల చూపు ఈ కంపెనీ షేర్లపై పడింది.
మల్టీ-స్పెషాలిటీ హెల్త్‌కేర్ ప్రొవైడర్ జూపిటర్ లైఫ్ లైన్ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.695-735గా నిర్ణయించబడింది. సెప్టెంబర్ 6న ప్రారంభమయ్యే ఐపీవో సెప్టెంబర్ 8న ముగియనుంది. ఐపీవో ఫ్లోటింగ్ ద్వారా కంపెనీ రూ.869.08 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రూ.542 కోట్లు విలువైన తాజా ఈక్విటీ షేర్లు ఉండగా.. మిగిలిన మెుత్తం ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ఉండనుంది.

జూపిటల్ హాస్పిటల్స్ ఐపీవో కోసం లాట్ సైజును 20 షేర్లుగా నిర్ణయించింది. ఎవరైనా రిటైల్ ఇన్వెస్టర్ కంపెనీలో ఒక లాట్ షేర్ల కోసం ఐపీవోలో అప్లై చేయాలంటే కనీసం రూ.14,700 వెచ్చించాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో రూ.261 కోట్ల ఈక్విటీ మెుత్తాన్ని యాంకర్ ఇన్వెస్టర్ల కోసం కంపెనీ రిజర్వు చేసి పెట్టింది. దీనిని సెప్టెంబర్ 5న సమీకరించుకుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 13న షేర్ కేటాయింపు, 14న రీఫండ్స్, 15న అర్హత పొందిన ఇన్వెస్టర్ల డీమ్యాట్ ఖాతాల్లోకి షేర్ల క్రెడిట్ జరుగుతాయి. కంపెనీ తన షేర్లను ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో లిస్ట్ చేయనుంది.
ముంబై మెట్రోపాలిటన్ ఏరియా,దేశంలోని పశ్చిమ ప్రాంతంలోని నగరాల్లో మూడు ఆసుపత్రులను కలిగి ఉంది. వీటి మెుత్తం పడకల సామర్థ్యం 1,194 బెడ్స్. కంపెనీ ఐపీవో ద్వారా వచ్చే ఆదాయాన్ని రుణాల చెల్లింపు, కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగించనుంది. మార్కెట్లో చాలా మంది విశ్లేషకులు జూపిటర్ లైఫ్ లైన్ IPOకి 'సబ్స్క్రైబ్' రేటింగ్ ఇచ్చారు. గ్రేమార్కెట్లో కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.218 ప్రీమియం ధరను కలిగి ఉన్నాయి. అంటే ఈ లెక్కన లిస్టింగ్ సమయంలో షేర్ ధర రూ.953కు అంటే 26.99 శాతం ప్రీమియం వద్ద ఉండవచ్చని అంచనా.


Click it and Unblock the Notifications