IPO News: తొలిరోజే ఐపీవో పేలుడు లాభాలు.. ఒక్కో షేరుకు రూ.225 లాభం..
IPO News: కొత్తవారం ఐపీవోల మార్కెట్ శుభారంభాన్ని నమోదు చేసింది. ఈ వారం తొలుత లిస్ట్ అయి మార్కెట్లోకి అడుగుపెట్టిన షేర్లు ఇన్వెస్టర్లకు ఊహించని లాభాలను అందించాయి. దీంతో చాలా మంది ధనవంతులుగా మారారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది విజయవంతంగా మార్కెట్లోకి అడుగుపెట్టిన జూపిటర్ లైఫ్ లైన్ హాస్పిటల్స్ స్టాక్ గురించే. ఇది ఎంట్రీతోనే భారీ లాభాలను అందించింది. గ్రేమార్కెట్ ప్రీమియం కంటే కొత్త తక్కువగా 30 శాతం లాభంతో జూపిటర్ హాస్పిటల్ స్టాక్ బీఎస్ఈలో రూ.960 వద్ద, ఎన్ఎస్ఈలో రూ.973కు లిస్ట్ అయ్యింది. స్టాక్ ఐపీవో ధరను కంపెనీ రూ.735గా నిర్ణయించగా.. లిస్టింగ్ సమయంలో రూ.225 లాభపడింది. లిస్టింగ్ తర్వాత హాస్పిటల్ షేర్లు 7.53% పెరిగి రూ.1032.25కి చేరాయి.

జూపిటర్ హాస్పిటల్స్ ఐపీవో మెుత్తంగా 64 రెట్ల కంటే ఎక్కువ సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. ఈ క్రమంలో రిటైల్ కోటా 8 సార్లు, క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ కొనుగోలుదారుల(QIB) పోర్షన్ 181.89 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల(NII) వాటా 36 సార్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. జూపిటర్ హాస్పిటల్ మొత్తం ఇష్యూ పరిమాణం రూ.869.08 కోట్లుగా ఉంది.
జూపిటర్ హాస్పిటల్ ఐపీవో కోసం ఒక్కో షేర్ ధరను రూ.695-735గా నిర్ణయించింది. మార్కెట్లో పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన రావటంతో ఎగువ ధర రూ.735 వద్ద షేర్లను కేటాయించింది. ఈ ఐపీవో సెప్టెంబర్ 6న ప్రారంభమై సెప్టెంబర్ 8న ముగిసింది. అలాగే ఒక్కో లాట్ లో 20 షేర్ల చొప్పున కంపెనీ ఐపీవోలో షేర్లను విక్రయించింది. అంటే ఎవరైనా ఇన్వెస్టర్ ఐపీవోలో ఒక్క లాట్ షేర్లను కొనుగోలు చేయాలంటే కనీసం రూ.14,700 పెట్టుబడిగా పెట్టారు.


Click it and Unblock the Notifications