Juniper Hotels News: గత ఏడాదికి పైగా కాలం నుంచి అనేక ఐపీవోలు దేశీయ స్టాక్ మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి. అయితే వీటిలో చాలా వరకు పెట్టుబడిదారులను సంపన్నులు మార్చగా మరికొన్ని నిరాశకు గురిచేశాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది నేడు మార్కెట్లోకి అడుగుపెట్టిన జునిపెర్ హోటల్స్ కంపెనీ ఐపీవో లిస్టింగ్ గురించే. ఈ ఐపీవోపై బెట్టింగ్ వేసి భారీగా సంపాదించాలనున్న ఇన్వెస్టర్లకు నిరాశ మిగిలింది. ఎందుకంటే నేడు ఐపీవో వాస్తవ ఇష్యూ ధర కంటే కేవలం 1.38 శాతం ప్రీమియం రేటు వద్ద దేశీయ స్టాక్ మార్కెట్లలోకి అరంగేట్రం చేశాయి. ఈ క్రమంలో ఎన్ఎస్ఈలో స్టాక్ ధర రూ.365 రేటు వద్ద జాబితా అవగా.. బీఎస్ఈలో స్టాక్ రూ.361.2 వద్ద ప్రారంభమైంది. అయితే కంపెనీ వాస్తవ ప్రైస్ బ్యాండ్ గరిష్ఠ ధర రూ.360గా విక్రయించిన సంగతి తెలిసిందే.

ఐపీవో స్టాక్ మార్కెట్లో జాబితాకు ముందరు గ్రేమార్కెట్ ప్రీమియం తుడిచిపెట్టుకు పోవటంతో షేర్లు పొందిన వారు పూర్తిగా నిరాశకు గురయ్యారు. ఫిబ్రవరి 21 నుంచి 23 వరకు తెరచి ఉన్న ఐపీవో కోసం ప్రైస్ బ్యాండ్ ధరను రూ.342-360గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ఐపీవో ద్వారా కంపెనీ మార్కెట్ల నుంచి రూ.1,800 కోట్లను విజయవంతంగా సమీకరించింది. ఇందుకోసం కంపెనీ పూర్తిగా 5 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించింది.
అర్హత కలిగిన సంస్థాగత పెట్టుబడిదారులు రిజర్వ్ చేసిన భాగాన్ని 2.96 రెట్లు కొనుగోలు చేశారు. ఇదే క్రమంలో రిటైల్ ఇన్వెస్టర్లు కేటాయించిన కోటా కంటే 1.28 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోసం కేటాయించిన భాగం 0.85 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్ చేయబడింది.
లగ్జరీ హోటల్ డెవలప్‌మెంట్, యాజమాన్య స్థలంలో ఉన్నందున జునిపర్ హోటల్స్ మొత్తం 1,836 గదులతో ఏడు హోటళ్లు, సర్వీస్డ్ అపార్ట్‌మెంట్ల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. కంపెనీ లగ్జరీ కేటగిరీలో గ్రాండ్ హయత్ ముంబై హోటల్ అండ్ రెసిడెన్సెస్, అందాజ్ దిల్లీ కలిగి ఉండగా.. ఉన్నత స్థాయి హయత్ దిల్లీ నివాసాలు, హయత్ రీజెన్సీ అహ్మదాబాద్, హయత్ రీజెన్సీ లక్నో, హయత్ రాయ్పూర్, హయత్ ప్లేస్ హంపి ఉన్నాయి.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications