ఉద్యోగులకు గుడ్‌న్యూస్: ఇన్ఫోసిస్ ప్రమోషన్లు, శాలరీ హైక్, ఎప్పటి నుండి.. ఎవరికంటే?

కరోనా మహమ్మారి నుండి కార్యకలాపాలు క్రమంగా కోలుకుంటున్నాయి. నిరుద్యోగిత రేటు క్రమగా తగ్గింది. జూన్‌లో దాదాపు 40 లక్షల ఉద్యోగాల సృష్టి జరిగింతే, జూలైలో 50 లక్షల ఉద్యోగాలు పోయాయి. లాక్ డౌన్ సమయంలో 30 శాతం వరకు ఉన్న నిరుద్యోగిత రేటు ప్రస్తుతం 10 శాతం దిగువకు చేరుకుంటోంది. ఇది ఆర్థిక కార్యకలాపాలు, తద్వారా జాబ్ మార్కెట్ కొంత కోలుకుంటుందని వెల్లడిస్తోంది. ఇక, ఐటీ రంగంలో, అందులోను టాప్ 5 సంస్థల్లోనే ఈ ఆర్థిక సంవత్సరంలో లక్షకు పైగా ఉద్యోగాలు రానున్నాయి. కరోనా కారణంగా ఈ ఏడాది చాలా కంపెనీలు వేతనాలు, ప్రమోషన్లు పక్కన పెట్టాయి. కొన్ని కంపెనీలు వీటిని అమలు చేస్తున్నాయి.

ఉద్యోగులకు ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్

ఉద్యోగులకు ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్

భారత్ రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. గ్లోబల్ కస్టమర్ల నుండి భారీ ఒప్పందాలు సాధిస్తున్న ఈ ఐటీ దిగ్గజం సెప్టెంబర్ నాటికి అర్హత కలిగిన జూనియర్, మధ్యస్థాయి సిబ్బందికి పదోన్నతులు ఇవ్వడానికి సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. ఈ కంపెనీలో దాదాపు 2.4 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. కరోనా నేపథ్యంలో ఏప్రిల్‌లో వేతనాల పెంపు, ప్రమోషన్లు నిలిచిపోయాయి. వచ్చే నెల నుండి దీనికి సంబంధించి ప్రాసెస్ ప్రారంభించనుందని తెలుస్తోంది.

వీరికి ప్రమోషన్

వీరికి ప్రమోషన్

ప్రస్తుతం ఐటీ కంపెనీలు 90శాతానికి పైగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. ఇన్ఫీ కొత్త ఒప్పందాలు దక్కించుకుంది. దీంతో ఈ ఆర్థికసంవత్సరంలో కొంత వృద్ధిని అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగా పలు ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ఇన్ఫోసిస్ జాబ్ లెవల్(JL) ఫైవ్ నుండి అంతకు కిందిస్థాయి ఉద్యోగులకు పదోన్నతులు అందించనుందట. ఇందులో పదేళ్ల కంటే తక్కువ అనుభవం ఉన్న ఉద్యోగులు ఎక్కువగా ఉంటారని తెలుస్తోంది.

సగానికి పైగా ప్రమోషన్‌కు అర్హులు

సగానికి పైగా ప్రమోషన్‌కు అర్హులు

సెప్టెంబర్ 2020 ప్రమోషన్, శాలరీ హైక్‌లో ఇన్ఫోసిస్‌లో సగానికి పైగా ప్రమోషన్‌కు అర్హులు అని తెలుస్తోంది. మొత్తం ఉద్యోగుల్లో 1.20 లక్షల మంది అర్హులు. కంపెన్షేషన్ రివిజన్లు తాము హోల్డ్‌లో పెట్టామని, అయితే కొన్ని ప్రమోషన్లు, ఈ క్వార్టర్‌లో ప్రారంభించనున్నామని, ఎక్కడ వెకెన్సీ ఉందో అక్కడ వీటిని పూర్తి చేస్తామని కంపెనీ అధికారి వెల్లడించినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి.

ఇన్ఫోసిస్ ఫస్ట్

ఇన్ఫోసిస్ ఫస్ట్

కాగ్నిజెంట్, క్యాప్‌జెమినీలు గ్లోబల్ కంపెనీలు. ఇప్పటికే ఈ కంపెనీలు ప్రమోషన్లు ఆఫర్ చేశాయి. అయితే భారత్‌కు చెందిన ఐటీ కంపెనీల్లో మొట్టమొదట ప్రమోమషన్లు, శాలరీ హైక్ ఆఫర్ చేస్తోంది ఇన్ఫోసిస్ మాత్రమే. కొంతమంది ఉద్యోగులు సంస్థను విడిచి పెట్టారు. హెడ్ కౌంట్ తగ్గింది. 2020 మార్చి 30 నాటికి ఉద్యోగుల సంఖ్య 2,42,371 కాగా, 2020 జూన్ 20 నాటికి 2,39,233 తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+