Ration Card ekyc: రేషన్ కార్డు ఇకేవైసీ చేసుకున్నారా.. జూలై 31 చివరి గడువు..!

దేశంలో రేషన్ కార్డుల ఇకేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. రేషన్ కార్డు ఉన్నవారు ఇకేవైసీ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ ఇప్పటి వరకు కూడా ఇకేవైసీ చేసుకోని వారు ఎవరైనా ఉంటే వెంటనే చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులు సూచిస్తున్నారు. రేషన్ కార్డులు ఇకేవైసీ చేసుకోవడానికి గడువు జూలై 31గా ఉంది. అలోపు ekyc పూర్తి చేసుకోవాలని చూస్తున్నారు. ఇకేవైసీ చేసుకున్న వారి పేర్ల మాత్రమే రేషన్ కార్డులు ఉంటాయని చెబుతున్నారు. గతంలో చాలా వరకు రేషన్ కార్డు కలిగి ఉన్నవారు ఎవరైన చనిపోతే.. వారి పేరుపై కూడా రేషన్ తీసుకునే వారు.

ఉదాహరణకు ఒక రేషన్ కార్డులో ఆరుగురు సభ్యులు ఉంటే.. అందులో దంపతులు, వారికి ఇద్దరు పిల్లలు, నానమ్మ, తాత ఉన్నారనుకుంటే. వారు నెలకు ఆరుగురు పేరుతో రేషన్ తీసుకుంటారు. అయితే ఇందులో తాత చనిపోయిన కూడా కుటుంబ సభ్యులు ఆయన పేరుపై రేషన్ తీసుకుంటున్నారు. ఇలాంటి వాటిని అరికట్టడానికి రేషన్ కార్డు ఇకేవైసీ తీసుకొచ్చారు. రేషన్ కార్డులో నమోదైన ప్రతి కుటుంబ సభ్యుడు ఇకేవైసీ చేసుకోవాలి. ఇందుకు వారు దగ్గరలో ఉన్న రేషన్ షాప్ కు వెళ్లి కేవైసీ చేసుకోవాలి.

Ration Card ekyc

మీరు బయోమెట్రిక్ (వేలిముద్ర) లేదా ఐరిస్ స్కాన్ ద్వారా ఇకేవైసీ పూర్తి చేయవచ్చు. ఇందుకు ఎలాంటి ఛార్జ్ ఉండదు. ఇందుకోసం ఒరిజినల్ రేషన్ కార్డుతో పాటు, రేషన్ కార్డులో నమోదైన ప్రతి కుటుంబ సభ్యుడి ఒరిజినల్ ఆధార్ కార్డు వెంట తీసుకెళ్లాలి. ఆధార్ కార్డ్ అందుబాటులో లేకుంటే.. ఆధార్ నంబర్ అయిన గుర్తుంచుకోవాలి. ఇప్పటికీ కూడా ఇకేవైసీ చేసుకోని వారు ఎవరైన ఉంటే వెంటనే స్థానిక రేషన్ డీలర్ వద్దకు వెళ్లి చేసుకోవాలి. ఇది ఉచిత సేవ. డబ్బులు తీసుకోవడం ఉండదు.

ఇకేవైసీ అయిందా కాలేదా అని చాలా మంది డౌట్ ఉంటుంది. ఇలా డౌట్ ఉన్నవారు స్థానిక రేషన్ డీలర్ వద్దకు వెళ్లాలి. మీ రేషన్ కార్డు నంబర్ చెప్పాలి. మీ నంబర్ ఎంటర్ చేయగానే రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల పేర్లు కనిపిస్తాయి. ఇకేవైసీ పూర్తయన వారి పేరు గ్రీన్ లో కనిపిస్తోంది. ఇకేవైసీ లేని వారి పేరు రెడ్ కాలర్ లో కనిపిస్తోంది. అయితే పిల్లలకు కూడా ఇకేవైసీ చేయించాలా అని చాలా మందికి డౌట్ ఉంది. ఆరు ఏళ్లు దాటిన వారికి ఇకేవైసీ చేయవచ్చని చెబుతున్నారు. దీనిపై అధికారిక సమాచారం లేదు. ఇకేవైసీ చేయకుంటే.. రేషన్ కార్డులో పేరు తొలగిస్తారు. దీంతో వారు ప్రభుత్వ పథకాలకు అనర్హులు అవుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+