ITR Filing Deadline: గడచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్ ఫైల్ చేసేందుకు ఆఖరి గడియలు వచ్చేశాయి. నేడు అంటే జూలై 1, 2024తో పన్ను చెల్లింపుదారులకు దీనికి సంబంధించిన గడువు ముగియనుంది.
ఏదైనా కారణం వల్ల మీరు పన్ను చెల్లింపులకు సంబంధించిన రిటర్న్ దరఖాస్తు చేయలేకపోతే దానిని తర్వాత కూడా పూరించేందుకు అవకాశం ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి నేడు తప్పనిసరిగా తమ పన్ను చెల్లింపులను పూర్తి చేయాలని టాక్స్ అధికారులు చెబుతున్నారు. చాలా మంది ఇప్పటికీ ఐటీఆర్ ఫైలింగ్ గడువును పొడిగించే అవకాశాలపై ఆశాజనకంగా ఉన్నారు. అయితే దీనికి సంబంధించిన అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు పన్ను నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది సైతం ఈ గడువును పన్ను శాఖ పొడిగించలేదు. కేవలం రెండేళ్ల కిందట కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేసిన సమయంలో మాత్రమే ఐటీఆర్ ఫైలింగ్ గడువు పొడిగించబడింది.

జూలై 31, 2024 ఐటీఆర్ దాఖలుకు చివరి తేదీగా ఆదాయపు పన్ను శాఖ స్పష్టంగా పేర్కొంది. ఈ క్రమంలో దీనిని వినియోగించుకోవటంలో విఫలమైన వారికి జరిమానాలు వంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో పన్ను చెల్లింపుదారులు డిసెంబర్ 31, 2024లోపు జరిమామాతో కలిపి టాక్స్ రిటర్న్ దాఖలుకు అనుమతి ఉంటుంది. అలాగే పన్ను విధానాల్లో రెండు ఉన్నందున ఆలస్యం వల్ల ప్రయోజనాలను మిస్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే దీని గురించి తప్పక మీ ఆర్థిక సలహాదారులు లేదా ఛార్టెడ్ అకౌంటెంట్లను సంప్రదించటం ఉత్తమం.
రిటర్న్ ఫైల్ చేయటంలో ఆలస్యానికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234 ఎఫ్ ప్రకారం రూ.5,000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. అయితే టాక్స్ ఫైల్ చేసే వ్యక్తి ఆదాయం ఏడాదికి రూ.5 లక్షల కంటే తక్కువగా ఉన్నట్లయితే వారు జరిమానాగా రూ.1,000 చెల్లించుకోక తప్పదు. ఇదే క్రమంలో జూలై 31 తర్వాత చెల్లించాల్సిన పన్ను బకాయికి నెలకు 1 శాతం చొప్పున వడ్డీని కూడా పన్ను శాఖ సదరు వ్యక్తుల నుంచి వసూలు చేస్తుంది. అయితే విధించిన పెనాల్టీ బాకీ ఉన్న పన్నును మించకూడదు.
ఇదే క్రమంలో ఎవరైతే వ్యక్తులు ఆడిటింగ్ అవసరమయ్యే ఖాతాల కోసం ఐటీఆర్ ఫైల్ చేయడానికి గడువును అక్టోబర్ 31, 2024 వరకు ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖ ఈ వ్యక్తులకు వారి ITR ఫైల్ చేయడానికి ముందు గుర్తింపు పొందిన చార్టర్డ్ అకౌంటెంట్ నుంచి వారి ఆడిట్ పూర్తి చేయడానికి అదనంగా మూడు నెలల సమయం ఇస్తుంది. అలాగే అంతర్జాతీయ లావాదేవీలలో పాల్గొనే వ్యాపారాల కోసం ఐటీఆర్ ఫైల్ చివరి గడువు నవంబర్ 30గా ఇవ్వబడింది. ఎవరైనా వ్యక్తి తన ఐటీఆర్ లో తప్పులు దొర్లినట్లు గమనిస్తే వాటిని సరిచేసి రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేసేందుకు డిసెంబర్ 31, 2024 వరకు ఉంటుంది. ఈ సమయంలోపు వ్యక్తులు ఎన్నిసార్లైనా దీనిని చేయవచ్చు.


Click it and Unblock the Notifications