ముంబై: చాలామందికి బిర్యానీ అంటే ఎంతో ఇష్టం. హోటల్‌కు వెళ్తే బిర్యానీ తినేవాళ్లు ఎక్కువగా ఉంటారు. బిర్యానీ ప్రియుల కోసం ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ చైన్ డామినోస్ పిజ్జా సిద్ధమైంది. 'ఏక్‌దమ్' బిర్యానీ పేరుతో మార్కెట్లోకి వస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు జుబిలాంట్ ఫుడ్ వర్క్స్ ఓ ప్రకటనలో తెలిపింది. తమ బిర్యాని మొదట గురుగ్రామ్‌లోని మూడు రెస్టారెంట్లలో లభిస్తుందని, ఆ తర్వాత ఢిల్లీలో ప్రారంభిస్తామని తెలిపింది. ఈ సేవలు యాప్, వెబ్ సైట్లలో అందుబాటులో ఉంటాయని పేర్కొంది

వెరైటీ బిర్యానీలు..
హైదరాబాద్ బిర్యానీ, లక్నో నవాబ్ బిర్యానీ, కోల్‌కతా బిర్యానీ, బటర్ చికెన్ బిర్యానీ వంటి 20 రకాల బిర్యానీలను కస్టమర్లకు అందించనున్నట్లు జుబిలాంట్ ఫుడ్ వర్స్క్స తెలిపింది. వెజ్, నాన్-వెజ్ వంటలను వేర్వేరుగా చేస్తామని తెలిపింది. వీటితో పాటు కబాబ్స్, స్వీట్స్ కూడా ఉంటాయని ప్రతినిధులు వెల్లడించారు. ఆహారాన్ని చెదరని, పర్యావరణ హితమైన ప్రత్యేక దమ్ సీలుతో అందించనున్నారు. వీటి ధరలు రూ.99 నుండి ప్రారంభమవుతున్నాయి. జుబిలాంట్ ఫుడ్ వర్క్స్‌కు దేశవ్యాప్తంగా 280కి పైగా పట్టణాలు, నగరాల్లో డామినోస్ పిజ్జా రెస్టారెంట్లను నిర్వహిస్తోంది.

బిర్యానీ ఆర్డర్స్ ఎక్కువ
జుబిలాట్ ఫుడ్ వర్క్స్ లిమిటెడ్ డామినోస్ పిజ్జా, డంకన్ డోనట్స్ బ్రాండ్స్‌తో రెస్టారెంట్లను నిర్వహిస్తోంది. మన దేశంలో బిర్యానీకీ యమ డిమాండ్ ఉంది. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్‌లో 2017 నుండి ఎక్కువగా వీటినే ఆర్డర్ చేస్తున్నట్లు మోర్గాన్ స్టాన్లీ తెలిపింది.

షేర్ 5 శాతానికి పైగా జంప్
బిర్యానీ రంగంలోకి జుబిలాంట్ ఫుడ్ వర్స్క్ ఎంటర్ కావడంతో నేడు ఆ కంపెనీ స్టాక్స్ భారీగా లాభపడ్డాయి. ఓ సమయంలో షేర్ 10 శాతానికి పైగా ఎగబాకి రూ.2,922ను తాకింది. 52 వారాల గరిష్టాన్ని నమోదు చేసింది. చివరకు 5.56 శాతం లాభంతో రూ.2,825 వద్ద క్లోజ్ అయింది. నేడు ఒక్కరోజే షేర్ రూ.148కి పైగా లాభపడటం గమనార్హం.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications