JSW Group: ఏపీ తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఏపీకి పోటీగా పక్కనే ఉన్న కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు సదుపాయాలను అందిస్తున్నాయి. దీంతో రాష్ట్రాల మధ్య పోటీ విపరీతంగా పెరిగిపోయింది. ప్రభుత్వాలు సైతం కంపెనీలకు అనేక సౌకర్యాలు, తగ్గింపులను అందిస్తూ ఆకర్షిస్తున్నాయి.

బెంగళూరు..
ఈరోజు బెంగుళూరులో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సమావేశంలో JSW గ్రూప్ లీడర్ సజ్జన్ జిందాల్ పాల్గొన్నారు. కర్ణాటకలోని తమ అన్ని వ్యాపారాల్లో రానున్న 5 ఏళ్లలో సుమారు రూ.లక్ష కోట్లు ఇన్వెస్ట్ చేయాలని యోచిస్తున్నట్లు సజ్జన్ ప్రకటించారు.

కర్ణాటక వ్యాపారాలు..
కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా స్టీల్, గ్రీన్ ఎనర్జీ, సిమెంట్, పెయింట్స్, న్యూ గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్‌లలో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ భారీగా పెట్టుబడులను కలిగి ఉంది. అయితే వచ్చే 5 ఏళ్లలో వీటిని మరింతగా పెంచాలని కంపెనీ భావిస్తున్నట్లు సజ్జన్ జిందాల్ వెల్లడించారు. ఈ నిర్ణయం కన్నడ ప్రజలకు మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించనుంది.

JSW స్టీల్..
కర్ణాటకలోని బళ్లారిలో కొనసాగుతున్న స్టీల్ ప్లాంట్, విజయనగర్‌లో తయారీ యూనిట్ కోసం JSW గ్రూప్ 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.20,000 కోట్ల ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేసింది. ఏడాదికి 12 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో, విజయనగర్‌లోని తయారీ కర్మాగారం దేశంలో అతిపెద్ద సింగిల్-సైట్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ తయారీ కేంద్రం. అత్యుత్తమ సాంకేతికత, వేగం, తయారీలో క్వాలిటీ ఈ ప్లాంట్ ప్రత్యేకత. ఇందులో రెండు యూనిట్లు ఉన్నాయి.

సజ్జన్ జిందాల్..
కర్ణాటక నిజంగా "ఒక రాష్ట్రం అనేక అవకాశాలు" అనే మంత్రాన్ని సూచిస్తుంది. దేశంలో అత్యంత ప్రాధాన్యత గల పెట్టుబడి గమ్యస్థానాల్లో ఒకటిగా కర్ణాటక తన స్థానాన్ని సంపాదించుకుందని సజ్జన్ జిందాల్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

బసవరాజ్ బొమ్మై..
కర్నాటకలో మూడు రోజుల పాటు జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్ల సమావేశం సుమారు రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తుందని సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా కొత్తగా 3 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని బొమ్మై పేర్కొన్నారు. ఈ సమావేశాలు నవంబర్ 2 నుంచి 4 వరకు జరగనున్నాయి. ఈ ఏడాది లక్ష ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు. అదే విధంగా రానున్న రెండేళ్లలో ప్రభుత్వ శాఖల్లోని 2.5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications