Sajjan Jindal: జిందాల్ చేతికి MG మోటార్ స్టీరింగ్.. ఫైనలైన డీల్.. పూర్తి వివరాలు..
Sajjan Jindal: దేశీయ కంపెనీలు ప్రస్తుతం ఆటో రంగంలో సంచలనాలకు తెరతీస్తున్నాయి. ప్రపంచ స్థాయి కంపెనీలను చేజిక్కించుకుంటూ ముందుకు సాగుతున్నాయి.
తాజాగా JSW గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్, షాంఘైకి చెందిన SAIC మోటార్ కార్ప్ మధ్య నెలల తరబడి చర్చలు ముగిశాయి. ఈ క్రమంలో MG మోటార్ ఇండియాను నడిపేందుకు ఒక మహా కూటమి కోసం నిబంధనలను ఖరారు చేసుకున్నాయి. దీపావళి నాటికి దీనిపై అధికారికంగా కంపెనీ వర్గాలు ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా ఈ డీల్ కారణంగా ఎంజీ మోటార్ ఇండియా విలువ ఒక బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని తెలుస్తోంది.

కొత్తగా ఏర్పడిన కూటమి జనవరి 2024 నాటికి ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేస్తుంది. ఈ ఒప్పందం అనేక దశల్లో అమలు చేయబడుతుందని, దీని ముగింపులో MG మోటార్ చైనా కంపెనీగా నిలిచిపోతుందని పేర్కొంది. మెుదటి దశలో జిందాల్ కంపెనీ 32-35 శాతం వాటాలను కలిగి ఉండనుంది. అలాగే మెజారిటీ 51 శాతం వాటాలను SAIC హోల్డ్ చేస్తుంది. మిగిలిన వాటాలను భారతీయ ఆర్థిక సంస్థ కలిగి ఉండనుందని సమాచారం. ఇదే క్రమంలో MG భారతీయ డీలర్లు, స్థానిక ఉద్యోగులు 6-7 శాతం కలిగి ఉండనున్నారు.
దీనికి అనుగుణంగా ఎంజీ మోటార్ ఇండియా తన ఐపీవోను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ప్రారంభించనుంది. దీనిలో SAIC తన స్టాక్‌ను విక్రయించి చైనా యాజమాన్యాన్ని 38-40 శాతానికి తగ్గించింది. కాలక్రమేణా సజ్జన్ జిందాల్ యాజమాన్యం 49 శాతానికి, చివరికి 51 శాతం వాటాలను హోల్డ్ చేయనున్నట్లు నివేదికి పేర్కొంది. చైనీస్ యాజమాన్యం 49 శాతం కంటే తక్కువగా ఉన్నందున.. MG మోటార్ చైనీస్ కంపెనీగా ఉండదని, బోర్డు- మేనేజ్‌మెంట్‌లో మెజారిటీ భారతీయ ప్రాతినిధ్యం కూడా ఉంటుందని నివేదిక పేర్కొంది. దీనికోసం కొత్త సీఈవోను నియమించనున్నారు.


Click it and Unblock the Notifications