IPO News: తొలిరోజే దిమ్మతిరిగే లాభాలిచ్చిన ఐపీవో.. 20% ప్రీమియం ధరకు బంపర్ లిస్టింగ్..
JSW IPO: కొత్త వారం మార్కెట్లోకి అడుగుపెట్టిన ఐపీవో సూపర్ లాభాలతో ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచింది. తొలిరోజే భారీ లాభాలను అందిస్తూ బంపర్ లిస్టింగ్ చేసిన ఐపీవో. మార్కెట్ల ప్రతికూలతల్లోనూ దుమ్ముదులిపే లాభాలను అందించింది.
ఇప్పుడు మనం మాట్లాడుతున్నది నేడు మార్కెట్లోకి ముందుగా అడుగుపెట్టిన JSW ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఐపీవో గురించే. ఈ స్టాక్ ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో షేర్లు అరంగేట్రం చేసింది. కంపెనీ ఐపీవోలో షేర్లను రూ.119 ధరకు విక్రియించినప్పటికీ 20.2 శాతం ప్రీమియం ధర రూ.143 వద్ద మార్కెట్లోకి ప్రీమియం ధరకు అడుగుపెట్టింది. ఈ ఐపీవో సెప్టెంబర్ 25న సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడి సెప్టెంబర్ 27న ముగిసింది. కంపెనీ షేర్ల ప్రైస్ బ్యాండ్ ధరను రూ.113-రూ.119గా నిర్ణయించిన సంగతి తెలిసిందే.

JSW ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ IPO పబ్లిక్ ఇష్యూలో 75% కంటే తక్కువ కాకుండా క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారులకు(QIB), 15% కంటే ఎక్కువ కాని సంస్థాగత పెట్టుబడిదారులకు(NII), రిటైల్ పెట్టుబడిదారుల కోసం ఆఫర్‌లో 10% కంటే ఎక్కువ మెుత్తాన్ని విక్రయించింది. ఈ ఐపీవో ద్వారా మార్కెట్ల నుంచి కంపెనీ రూ.2,800 కోట్లను సమీకరించింది. ఇది మెుత్తం తాజా ఈక్విటీ ఇష్యూను కలిగి ఉంది.
ఐపీవో ద్వారా సేకరించిన మెుత్తాన్ని కంపెనీ తన పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థలైన JSW ధర్మ్‌తర్ పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్, JSW జైగర్ పోర్ట్ లిమిటెడ్‌లలో పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. దీనికి తోడు వాటి రుణాల చెల్లింపుల కోసం ఐపీవో సొమ్మును కొంతమేర వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్ లో వెల్లడించింది. ఎల్‌పీజీ టెర్మినల్ విస్తరణ, ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ స్థాపనతో సహా జైఘర్ పోర్ట్‌లో ప్రతిపాదిత విస్తరణ/అప్‌గ్రేడేషన్ పనుల కోసం తన పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ జేఎస్‌డబ్ల్యు జైగర్ పోర్ట్ లిమిటెడ్‌లో పెట్టుబడి పెట్టాలని కంపెనీ యోచిస్తోంది.


Click it and Unblock the Notifications