IPO News: మార్కెట్లోకి త్వరలో జేఎస్డబ్ల్యూ ఇన్‌ఫ్రా ఐపీవో.. పూర్తి వివరాలు
IPO News: గత కొన్ని నెలలుగా దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోలు అడపదడప కనిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా జేఎస్డబ్ల్యూ గ్రూప్ కంపెనీ సైతం తన ఐపీవోను మార్కెట్లో ఫ్లోట్ చేయాలని చూస్తోంది.
JSW గ్రూప్ కు చెందిన జేఎస్డబ్ల్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఐపీవో ప్రారంభించడానికి క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ వద్ద DRHP దాఖలు చేసింది. ఈ కంపెనీ పోర్టుల వ్యాపారంలో కొనసాగుతోంది. సజ్జల్ జిందాల్ నేతృత్వంలోని ఈ కంపెనీ ఐపీవో ద్వారా రూ.2,800 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది.

ఒక్కో షేరును రూ.2 ముఖ విలువతో ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. JSW ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థాపిత కార్గో హ్యాండ్లింగ్ కెపాసిటీ, హ్యాండిల్ చేయబడిన కార్గో వాల్యూమ్‌లలో వృద్ధి పరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న పోర్ట్-సంబంధిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల్లో ఒకటిగా ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యం పరంగా దేశంలో రెండవ అతిపెద్ద వాణిజ్య పోర్ట్ ఆపరేటర్‌గా కంపెనీ కొనసాగుతోంది.
డిసెంబర్ 31, 2022 నాటికి డ్రై బల్క్, బ్రేక్ బల్క్, లిక్విడ్ బల్క్, గ్యాస్‌లు, కంటైనర్‌లతో సహా బహుళ-కమోడిటీ కార్గో కోసం సంవత్సరానికి 153.43 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. 2004లో కార్యకలాపాలను ప్రారంభించిన కంపెనీ దేశవ్యాప్తంగా 9 పోర్టులలో సేవలను అందిస్తోంది. JSW ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దలాల్ స్ట్రీట్‌లో అరంగేట్రం చేయనున్న JSW గ్రూప్ కు చెందిన మూడవ కంపెనీ కావటం విశేషం. డిసెంబర్ 31, 2022తో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి రూ.447.24 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.


Click it and Unblock the Notifications